అగ్ని కీలలకు ఆహుతైన మొక్కజొన్న | - | Sakshi
Sakshi News home page

అగ్ని కీలలకు ఆహుతైన మొక్కజొన్న

May 4 2026 7:19 AM | Updated on May 4 2026 7:19 AM

ఇంకొల్లు(చినగంజాం): ప్రమాదవశాత్తూ పంట పొలాల్లో మంటలు చెలరేగడంతో పంటలు ఆహుతయ్యాయి. తహసీల్దార్‌ ఏవీఎస్‌ శ్రీనివాస్‌ అందించిన వివరాలు మేరకు.. మండలంలోని పావులూరు, చిన్ననక్కలపాలెం గ్రామాల మధ్య పంట పొలాల్లో ఆదివారం ఉదయం 9 గంటలు నుంచి 10 గంటల సమయంలో మూడు ప్రాంతాల్లో మంటలు చెలరేగడంతో సుమారు 100 ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా తగులబడిపోయాయి. సమాచారం అందుకున్న తహసీల్దార్‌ శ్రీనివాస్‌ చీరాల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి వచ్చి సుమారు మూడున్నర గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోనికి తీసుకొనివచ్చారు. అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాద స్థలానికి ఇంకొల్లు సీఐ రామానాయక్‌, ఎస్‌ఐ జీ సురేష్‌, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారులు హాజరయ్యారు. అగ్ని ప్రమాద ఘటనలో రైతు సింగంశెట్టి వెంకటరత్నానికి చెందిన 4 ఎకరాలు మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి కావడంతో తీవ్రంగా నష్టపోయాడు. మిగిలిన 96 ఎకరాల్లో రైతులు ముందుగానే పంటను కోయడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా కోసిన తర్వాత మిగిలిన చొప్ప కూడా అగ్నిప్రమాదంలో తగలబడిపోయాయి. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సందర్శించి పంట నష్టపోయిన రైతుకు నష్టపరిహారం అందజేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాల్సిందిగా సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement