రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

May 4 2026 7:19 AM | Updated on May 4 2026 7:19 AM

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

వినుకొండ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలోని మార్కాపురం రోడ్డులో గల చెక్‌పోస్టు సెంటర్‌లో ఆదివారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన శివరాత్రి మునెయ్య (30) వినుకొండ రూరల్‌ మండలం శివాపురం వద్ద జరిగే పాతపాటి పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా హోటల్‌ నిర్వహించేందుకు సామగ్రి ఆటోలో వేసుకొని బయలుదేరాడు. చెక్‌పోస్టు సెంటర్‌ వద్దకు రాగానే జేసీబీ రోడ్డుపైకి రావడంతో ఆటో అదుపు తప్పి జేసీబీని ఢీకొట్టింది. ఈ ఘటనలో మునెయ్య మృతి చెందాడు. ఆటోలో ఉన్న మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మునయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement