● జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ● సత్తెనపల్లి మండలం అబ్బూరులో పర్యటన
సత్తెనపల్లి: జనగణనలో భాగంగా మొదటి విడతలో ప్రారంభమైన గృహ గణన సర్వే పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. సత్తెనపల్లి మండలం అబ్బురు గ్రామంలో శుక్రవారం ఆమె పర్యటించారు. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లతో కలిసి గృహ గణన జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణతో కలిసి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి అంగన్‌వాడీ చిన్నారులకు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారం, పిల్లల హాజరును పరిశీలించారు. చిన్నారులకు నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డేలో ఆమె పాల్గొని చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పుట్టగొడుగుల పెంపకం కుటీర పరిశ్రమ వద్దకు వెళ్లి పరిశ్రమ నడుపుతున్న తీరును, మార్కెటింగ్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సత్తెనపల్లి ఆర్డీవో కె.శ్రీరాములు, తహసీల్దార్ కెఎస్ చక్రవర్తి, ఎంపీడీవో బండి శ్రీనివాసరెడ్డి, ఏపీ బట్రాజు కార్పొరేషన్ చైర్మన్ సరికొండ వెంకటేశ్వరరాజు, నాయకులు మన్నెం శివనాగమల్లేశ్వరరావు, భీమినేని వందనాదేవిపాల్గొన్నారు.
సాగర్ నీటిమట్టం వివరాలు
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 525.70 అడుగులకు చేరింది. ఇది 159.8751 టీఎంసీలకు సమానం. ఎస్‌ఎల్‌బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 450 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.


