గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గుంటూరు ఆక్స్‌ఫర్డ్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని ఆక్స్‌ఫర్డ్ విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్. విజయభాస్కర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. గుంటూరు బృందావన్‌గార్డెన్స్‌లోని ఆక్స్‌ఫర్డ్ మెయిన్ క్యాంపస్‌లో జరిగిన విద్యార్థుల అభినందన సభలో విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థులు 600 మార్కులకు అత్యధికంగా 597, 594 కై వసం చేసుకున్నారని చెప్పారు. అదే విధంగా ముగ్గురు విద్యార్థులు 593 సాధించగా, 592 మరో ముగ్గురు, ఐదుగురు విద్యారులు 591 కై వసం చేసుకున్నట్లు వివరించారు. 590కు పైగా 17 మంది, 580 పైన 74 మంది, 570 పైన 176 మంది, 560 పైన 271, 550కు పైగా 344, 540కి పైగా 423, 530కి పైగా 490, 520కి పైగా 543 మంది, 510కి పైగా 593, 500కు పైగా 641, 500లోపు 641 మంది విద్యార్థులు విజయం సాధించారని చెప్పారు. 1200 మంది విద్యార్థులకు గాను మ్యాథ్స్‌లో 104 మందికి 100 మార్కులు, 248 మందికి 95 పైన మార్కులు, తెలుగులో 108 మందికి 100 మార్కులు, 357 మందికి 95 మార్కులపైన మరియు సోషల్లో 71 మందికి 100 మార్కులు, 351 మందికి 95 పైన మార్కులు, సైన్స్‌లో 19 మందికి 100 మార్కులు, 243 మందికి 95 పైగా మార్కులు, హిందీలో 19 మందికి 100 మార్కులు, 230 మందికి 95 పైగా మార్కులు, ఇంగ్లీష్‌లో 230 మందికి 95కు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల నిరంతర కృషి, తల్లిదండ్రుల సహకారంతో ఆక్స్‌ఫర్డ్ ఘన విజయం సాధించిందని కొనియాడారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎస్.ప్రాన్సిస్‌రెడ్డి, వైస్ చైర్మన్ అరోన్‌రెడ్డి, డైరెక్టర్ జోసఫ్‌రెడ్డి, ఇన్‌చార్జ్‌లు మనోజ్, భాస్కర్ విద్యార్థులను అభినందించారు.


