బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి | - | Sakshi
Sakshi News home page

బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి

May 2 2026 7:32 AM | Updated on May 2 2026 7:32 AM

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్‌ జియాఉద్దీన్‌

గుంటూరు లీగల్‌: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్‌ జియాఉద్దీన్‌ మాట్లాడుతూ దైనందిన జీవితంలో కార్మికుల పాత్ర ముఖ్యమైనదన్నారు. సమాజంలో కార్మికులకు భద్రతా, పనికి సరిపడా వేతనం కార్మికుల హక్కులని తెలిపారు. ప్రజలందరూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ సమాజంలో ఎక్కువగా ఉందని, ఫ్యాక్టరీలు, హోటళ్లలో పిల్లలు కార్మికులుగా మారుతున్నారన్నారు. పేదరికం, అవగాహనా లోపం వలన తల్లిదండ్రులు పిల్లల చదువులు మాన్పించి కార్మికులుగా మారుస్తున్నారని తెలిపారు. బార్‌ ప్రెసిడెంట్‌ మధిర నాగేశ్వరరావు, ప్యానెల్‌ అడ్వకేట్‌, కార్మిక దినోత్సవంపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్స్‌ పాండురంగారావు, ఎం.మాధురి, ఏ.సంతోష్‌కుమార్‌, ఆర్‌.చేతన్‌, పి.వీరాంజనేయులు, స్టేక్‌ హోల్డర్స్‌, సోప్‌ వర్కర్స్‌, మునిసిపల్‌ వర్కర్స్‌, ప్యానెల్‌ అడ్వకేట్స్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement