మద్యం మత్తులో కారు బీభత్సం | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో కారు బీభత్సం

May 1 2026 5:51 AM | Updated on May 1 2026 5:51 AM

మద్యం మత్తులో కారు బీభత్సం

వినుకొండ: పట్టణ శివారులోని వెల్లటూరు రోడ్డులో బుధవారం రాత్రి మద్యం మత్తులో కొందరు యువకులు కారుతో బీభత్సం సృష్టించారు. అతి వేగంగా కారు నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తిని ఢీకొట్టడమే కాకుండా వరుస ప్రమాదాలకు కారణమయ్యారు. మద్యం సేవించి అదుపు లేకుండా కారు నడిపిన యువకులు తొలుత ఒక వ్యక్తిని ఢీకొట్టారు. ఆపై వేగంగా వెళ్లి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో అది ముక్కలైంది. ఒక ద్విచక్రవాహనాన్ని, తోపుడు బండిని కూడా కారుతో బలంగా ఢీకొట్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement