ఇద్దరూ సరస్వతీ పుత్రులే
రొంపిచర్ల: నాడు అన్న.. నేడు తమ్ముడు... ఇరువురు చదువులో సరస్వతీదేవికి కవలలు. పదవ తరగతి పరీక్షల్లో తమ సత్తా చాటి మండలంలో టాపర్లుగా నిలిచారు. గురువారం విడుదలై పది పబ్లిక్ పరీక్షల్లో గోగులపాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థి యర్రగుంట్ల నితీష్‌కుమార్ 587 మార్కులతో మండలంలో టాపర్‌గా నిలిచారు. గత ఏడాది నిర్వహించిన పది పబ్లిక్ పరీక్షల్లో నితీష్‌కుమార్ సోదరుడు నిరాజిత్‌కుమార్ 589 మార్కులతో మండలంలో టాపర్‌గా నిలిచి నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతున్నాడు. అన్నదమ్ములిద్దరూ మండలంలో టాపర్లుగా నిలవటంతో గోగులపాడులో పలువురు సదరు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభావతి, నాగరాజులను అభినందించారు. తండ్రి నాగరాజు రొంపిచర్లలోని ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, తల్లి ప్రభావతి గృహిణిగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు.


