వాలీబాల్ పోటీల విజేత కృష్ణవేణి జట్టు
నరసరావుపేట ఈస్ట్: స్థానిక కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల వాలీబాల్ పోటీలు గురువారం ముగిశాయి. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ సభకు ప్రిన్సిపాల్, టోర్నమెంట్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో వర్సీటీ యోగా కోఆర్డినేటర్ ఆచార్య బి.సూర్యనారాయణరావు, కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య మాట్లాడుతూ పోటీల్లో క్రీడాకారులు చూపిన క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి అభినందనీయన్నారు. కళాశాలతోనే క్రీడలను వదలకుండా రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో వర్సిటీ వ్యాయామ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు పి.శ్రీనివాసరావు, ధనలక్ష్మి వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్.వెంకట్రావు, డాక్టర్ గౌరీశంకర్, అబ్బాయి చౌదరి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎంఆర్‌కే సతీష్‌బాబు, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈదర ఆదిబాబు పాల్గొన్నారు. క్రీడాకారులను అభినందించి బహుమతులు అందించారు.
వరుసగా మూడోసారి విజేతగా కృష్ణవేణి
టోర్నమెంట్ విజేతగా వరుసగా మూడోసారి కృష్ణవేణి డిగ్రీ కళాశాల నిలిచింది. టోర్నమెంట్‌లో కళాశాలల నుంచి 20 జట్లు పాల్గొన్నాయి. లీగ్ దశలో ఫైనల్స్‌లో కృష్ణవేణి, వర్సిటీ జట్ల మధ్య మ్యాచ్ ఉత్కంఠ భరితంగా కొనసాగింది. తొలి రెండు సెట్లును కృష్ణవేణి జట్టు 27–25, 26–24 తేడాతో గెలుపొందగా, మూడవ సెట్‌లో పుంజుకున్న వర్సిటీ జట్టు 22–25 తేడాతో గెలుపొందింది. నాలుగవ సెట్‌లో కృష్ణవేణి జట్టు పక్కా ప్రణాళికతో వర్సిటీ జట్టుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 25–13 తేడాతో గెలుపొంది కప్పును కై వశం చేసుకుంది. వర్సిటీ జట్టు రన్నరప్‌గా, తృతీయ స్థానంలో ధనలక్ష్మి వ్యాయామ కళాశాల (ముప్పాళ్ల), నాల్గవ స్థానంలో బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు నిలిచాయి.
రన్నర్స్‌గా వర్సిటీ జట్టు
వాలీబాల్ పోటీల విజేత కృష్ణవేణి జట్టు


