రెండు పళ్ల విభాగం విజేత కేసానుపల్లి ఎడ్ల జత
కారెంపూడి: పల్నాటి ఉత్సవాల సందర్భంగా కారెంపూడిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలలో భాగంగా శనివారం రెండు పళ్ల విభాగంలో పోటీలు నిర్వహించారు. పోటీలను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తదితరులు ప్రారంభించారు. ప్రథమ బహుమతిని దాచేపల్లి మండలం కేసానుపల్లికి చెందిన నెల్లూరి రామకోటయ్య ఎడ్ల జత కై వసం చేసుకుంది. ద్వితీయ బహుమతిని పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలకు చెందిన పొన్నబోయిన విష్ణుభరత్ యాదవ్ జత, తృతీయ బహుమతిని బాపట్ల జిల్లా సంతమాగులూరుకు చెందిన వజ్రాల తేజశ్రీరెడ్డి, ప్రకాశం జిల్లా కంభం మండలం యర్రబాలెంకు చెందిన వెంకటగిరి హేమలతా నాయుడు కంబైన్డ్ జత గెలుచుకున్నాయి. నాల్గవ బహుమతిని నరసరావుపేట మండలం దొండపాడుకు చెందిన యర్రం రాజశేఖర్, యశ్వంత్ ఎడ్ల జత, ఐదో బహుమతిని బెల్లంకొండ మండలం మాచాయపాలెంకు చెందిన గౌరు కార్తికేయ, అమరావతి మండలం గిడుగుకు చెందిన భూపతి శ్రీనివాసరావు కంబైన్డ్ జత కై వసం చేసుకున్నాయి. ఆరో బహుమతిని పల్నాడు జిల్లా మాచవరం మండలం మల్లవోలుకు చెందిన ఘంటా రమ్య నాయుడు ఎడ్ల జత గెలుచుకున్నాయి. ఈ ఆరు బహుమతులను కారెంపూడికి చెందిన టీడీపీ నాయకుడు సంగినేడి ధనుంజయ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు సంగినేడి బాలకృష్ణ ప్రదానం చేశారు. పోటీలలో పాల్గొన్న మిగిలిన రెండు జతలకు కూడా నగదు బహుమతులను ప్రదానం చేశారు. బహుమతి ప్రదానంలో పంగులూరి అంజయ్య, చప్పిడి రాము కారెంపూడి రైతు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.


