గంజాయి కలిగియున్న యువకులు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి కలిగియున్న యువకులు అరెస్ట్‌

Oct 5 2025 5:01 AM | Updated on Oct 5 2025 8:48 AM

గంజాయ

గంజాయి కలిగియున్న యువకులు అరెస్ట్‌

మంగళగిరి టౌన్‌: గంజాయి కలిగియున్న యువకులను అరెస్ట్‌ చేసిన ఘటన మంగళగిరి రూరల్‌పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు... ముందుగా వచ్చిన సమాచారం మేరకు ఈగల్‌ టీమ్‌ తమ సిబ్బందితో మంగళగిరి రూరల్‌ పరిధిలోని కురగల్లు, బేతపూడి, ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం ప్రాంతాల్లో నిఘా పెట్టారు. ఆయా ప్రాంతాల్లో పలువురు యువకులు గంజాయి తీసుకుని వచ్చి మరికొంతమందికి విక్రయిస్తుండగా మెరుపుదాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి అమ్ముతున్న ముగ్గురు యువకులను, వినియోగిస్తున్న మరో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకని వారి వద్ద నుంచి సుమారు 150 గ్రాములు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు యువకులను రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాత్విక్‌ అనే యువకుడు ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తీసుకువచ్చి యువకులకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

చీరాల రూరల్‌: వేర్వేరు చోట్ల జరిగిన రెండు ప్రమాదాల్లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మృతి చెందారు. జీఆర్పీ ఎస్‌ఐ సీహెచ్‌ కొండయ్య తెలిపిన వివరాలు.. చీరాల రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఫైరాఫీసు గేటు వద్ద శుక్రవారం రాత్రి ఒకరు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. వయస్సు 30 నుంచి 35 ఏళ్లు ఉంటాయని, మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరో ఘటనలో వేటపాలెం– చినగంజాం స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి రైల్లో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు ఎస్‌ఐ వివరించారు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని, వయస్సు 40 ఏళ్లు ఉంటాయని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

7న అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై పోటీలు

గుంటూరు ఎడ్యుకేషన్‌: అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు ‘సేవ్‌ ది గర్ల్‌ చైల్డ్‌’ అనే అంశంపై వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలను పాఠశాల, జిల్లాస్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సంబంధిత విభాగాల్లో పాఠశాల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఈనెల 7న పాత బస్టాండ్‌ సెంటర్‌ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని పరీక్షా భవన్‌లో జిల్లాస్థాయిలో పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. తొలి మూడు స్థానాల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఈనెల 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవం రోజున జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా రూ.5,000, రూ.3,000, రూ.2,000 చొప్పున నగదు బహుమతులు, ప్రశంసాపత్రం అందజేస్తామని వివరించారు. జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు వారి పరిధిలోని పాఠశాలలకు సమాచారాన్ని చేరవేసి, ప్రతి హై స్కూల్‌ నుంచి విద్యార్థులు పోటీల్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్ర స్కూల్‌ గేమ్స్‌ టెన్నిస్‌ పోటీలకు ఎంపిక

గుంటూరు వెస్ట్‌ (క్రీడలు): శ్రీకాళహస్తిలో ఈనెల 7వ తేదీ నుంచి 9 వరకు జరగనున్న ఏపీ స్టేట్‌ స్కూల్‌ గేమ్స్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో ఎన్టీఆర్‌ స్టేడియానికి చెందిన ఆరుగురు క్రీడాకారులు జిల్లా జట్టుకు ఎంపికయ్యారని కోచ్‌ జీవీఎస్‌ ప్రసాద్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను రేమండ్స్‌ షో రూమ్‌ అధినేత టి.అరుణ్‌ కుమార్‌, ఏపీ రెరా సభ్యులు దామచర్ల శ్రీనివాసరావు, సహస్ర ఆర్థో అండ్‌ న్యూరో క్లినిక్‌ అధినేత డాక్టర్‌ ఎం. శివకుమార్‌, రక్షిత్‌, నాంచారయ్యలు అభినందించారని పేర్కొన్నారు.

ఎంపికై న క్రీడాకారుల వివరాలు...

అండర్‌ 19 బాలుర విభాగంలో కె.విన్సెంట్‌, ఊరుబంది లలిత్‌ కుమార్‌, బాలికల విభాగంలో సాధుర్ల కావ్య హర్షిత, అండర్‌ 17 బాలుర భాగంలో గంటా దిశాంత్‌, ఈ.జి. హర్షవర్ధన్‌, అండర్‌ 14 బాలుర విభాగంలో కుంభ సాయి నాగ కళ్యాణ్‌ ఎంపికయ్యారు.

ఎన్జీ రంగా వర్సిటీ విద్యార్థుల ప్రతిభ

గుంటూరు రూరల్‌: ఐసీఏఆర్‌, ఏఐఈఈఏ పరీక్షల్లో తమ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు జాతీయ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించారని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ ఆర్‌ శారదజయలక్ష్మిదేవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయానికి చెందిన మొత్తం 273 మంది విద్యార్థులు వ్యవసాయం, అనుబంధ విభాగాలలోని పీజీ కార్యక్రమాలకు ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించారన్నారు. ఈ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఐసీఏఆర్‌ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలలో పీజీ విభాగంలో ప్రవేశం పొందడానికి అర్హులని తెలిపారు. తమ విద్యార్థులు విశ్వవిద్యాలయం అందిస్తున్న నాణ్యమైన విద్యాబోధన వల్ల సాధించిన విజయమని తెలిపారు. పరీక్షల్లో అర్హత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

అన్నపూర్ణ కాంప్లెక్స్‌ ఖాళీ చేయాల్సిందే..!

నెహ్రూనగర్‌ (గుంటూరు ఈస్ట్‌): గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట ఉన్న నగరపాలక సంస్థకు చెందిన డాక్టర్‌ కొల్లి శారదా మార్కెట్‌లోని షాపుల లీజు గడువు పూర్తికావడంతో ఆగస్టు 18, 19, 20వ తేదీల్లో బహిరంగ వేలం నిర్వహించారు. ఒక్కో షాపును రూ.లక్షల్లో పాడు కుని దక్కించుకున్నారు. పాత లీజుదారులు పొన్నూరు రోడ్డు(బైపాస్‌) వద్ద ఉన్న అన్నపూర్ణ కాంప్లెక్స్‌లో షాపులు నిర్వహించుకుంటున్నారు. దీంతో మార్కెట్‌కు వచ్చే రైతులంతా అక్కడకు వెళ్లడంతో మార్కెట్‌లో వ్యాపార లావాదేవీలు ఆశించిన స్థాయిలో జర గడం లేదు.

ఈ నెల 10లోగా ఖాళీ చేయాలని ఆదేశాలు

మార్కెట్‌లో ఉన్న 81 షాపులకు బహిరంగ వేలం పాట నిర్వహించగా కార్పొరేషన్‌కు రూ.ఆరు కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. 81 షాపుల్లో 41 షాపులకు సంబంధించి కొత్తగా పాడుకున్న లీజుదారులు కార్పొరేషన్‌కు నాన్‌ రిఫండబుల్‌ గుడ్‌విల్‌ చెల్లించారు. ఈ క్రమంలో పాత లీజుదారులు కార్పొరేషన్‌ అధికారులు తమను అన్యాయంగా ఖాళీ చేయిస్తున్నారని హైకోర్టుకు వెళ్లడంతో కొత్త లీజుదారులు దక్కించుకున్న రేటుతో షాపులను రెండు నెలల పాటు నిర్వహించుకోవాలని ఆదేశించింది. దాని ప్రకారం అధికారులు పాత లీజుదారులకు తెలియజేసినప్పటికీ వారు దానికి కూడా అంగీకరించకుండా అన్నపూర్ణ కాంప్లెక్స్‌ వద్దే వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై కొత్త లీజుదారులు ప్రైవేట్‌గా మార్కెట్‌ను నిర్వహించకూడదని, ఇతర తగిన ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించగా కోర్టు పాత లీజుదారులకు షాక్‌ ఇస్తూ అన్నపూర్ణ కాంప్లెక్స్‌ను ఈ నెల 10వ తేదీలోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతో పాత లీజుదారులు డైలామాలో పడ్డారు.

హైకోర్టు ఉత్తర్వులు ఫాలో అవుతారో లేదో..!

అన్నపూర్ణ కాంప్లెక్స్‌ ఖాళీ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయి. వీరిని ఖాళీ చేయించేందుకు అధికారులు మల్లాగుల్లాలు పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాత లీజుదారులకు ఎమ్మెల్యే సపోర్ట్‌, కొత్త లీజుదారులకు మంత్రి సపోర్ట్‌ ఉందని అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం కావడంతో.. ఎవరికి సపోర్ట్‌గా వ్యవహరిస్తే రాజకీయంగా ఎటువంటి సమస్యలు వస్తాయో అని అధికారులు సందిగ్ధంలో ఉన్నారు.

గంజాయి కలిగియున్న యువకులు అరెస్ట్‌ 1
1/1

గంజాయి కలిగియున్న యువకులు అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement