
రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికి గాయాలు
బల్లికురవ: ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొనటంతో ఇరువురు గాయాల పాలయ్యారు. ఈ ఘటన ఆదివారం మండలంలోని అంబడిపూడి –కొమ్మినేని వారిపాలెం లింకురోడ్డులో జరిగింది. కొమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన కాకుమాను అరుణ్‌కుమార్ పని నిమిత్తం బైకు బల్లికురవ వెళుతున్నాడు. సోమవరప్పాడు గ్రామానికి చెందిన గుజ్జులైని శ్రీనివాసరావు బైకుపై కొమ్మినేని వారిపాలెం వెళుతూ ఒకరినొకరు ఢీకొన్నారు. స్థానికులు బల్లికురవ 108కి సమాచారం ఇవ్వటంతో ఈఎంటీ అశోక్ ప్రథమ చికిత్స తదుపరి క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
వస్తు సేవల పన్నుపై అవగాహన
చీరాల అర్బన్: ఇండియా చార్టర్డ్ అకౌంటెంట్స్ సంస్థ (ఐసీఏఐ) దక్షిణ ప్రాంతీయ మండలి (ఎస్‌ఐఆర్‌సీ) పరిధిలోని ఒంగోలు శాఖ, చీరాల చాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా ఆదివారం స్థానిక ఎన్‌వీఎస్‌ఎస్‌జేఆర్ కళ్యాణ మండపంలో ఆదాయపు పన్ను బిల్లు–2025, వస్తు సేవల పన్నుపై అవగాహన సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదాయపుపన్ను చీరాల అధికారి గ్రంధి మురళీకృష్ణ, రాష్ట్ర వస్తు సేవల పన్ను అసిస్టెంట్ కమిషనర్ రాయవరపు శ్రీనివాసరావు, కేంద్ర వస్తు సేవల పన్ను చీరాల సూపరింటెండెంట్ చింతలపల్లి వెంకట సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఆదాయపు పన్ను బిల్లులోని ముఖ్యమైన నిబంధనలు, వస్తు సేవల పన్నులో జరిగిన కీలక మార్పులపై వివరించారు. ఒంగోలు శాఖ అధ్యక్షుడు తిరువాయు కుమార్ ఆదాయపుపన్ను బిల్లులో ప్రధాన అంశాలను, వస్తు సేవల పన్ను గురించి వివరించారు. అనంతరం 75 ఏళ్లు పైబడిన సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్లను ప్రత్యేకంగా సత్కరించారు. కార్యక్రమంలో చీరాల చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి చిన్ని లీలాధరరావు, ఎంజీసీ మార్కెట్ అధ్యక్షుడు వేముల చంద్రశేఖరరావు, సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్లు పేరకం శ్రీమన్నారాయణ, కె.రాజేంద్రప్రసాద్, బైసాని జగన్‌మోహన్‌రావు, ఒంగోలు శాఖ కార్యదర్శి జి.యోగిరమణరెడ్డి, ఖజాంచీ, వి.శంకర్ నరేంద్రకుమార్ పాల్గొన్నారు.

రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికి గాయాలు

రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికి గాయాలు