
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ బాబు
పూనూరి గౌతంరెడ్డి మాట్లాడుతూ... మోసానికి బ్రాండ్ అంబాసిడర్‌గా చంద్రబాబు పాలిస్తున్నారని మండిపడ్డారు. రూ.5.60 లక్షల కోట్లు ఖర్చుచేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులతో ఏం చేసిందో అర్థం కావట్లేదన్నారు. చంద్రబాబు చెప్పుకొనేందుకు తనకంటూ ఒక్క పథకమైనా లేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఏది చెబితే అదే చేస్తారనే నమ్మకం ప్రజలలో ఉందన్నారు. పార్టీ సూచించిన ప్రకారం క్యూఆర్ కోడ్ ఉపయోగించుకుని ప్రతి ఇంటికి వెళ్లి బాబు మోసాలు ప్రజలకు తెలియచేయాలని కార్యకర్తలకు సూచించారు. భవిష్యత్‌లో కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. కేసులకు భయపడొద్దన్నారు.