
నమ్మి మోసపోయిన ప్రజలు
వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబు మోసం చేస్తాడని తెలిసినా ఏదో ఒక ఆశతో ఓట్లేసి ప్రజలు మళ్లీ అధికారం అప్పగించారని అన్నారు. గత ఎన్నికల్లో ఓడింది తామే కాదని, కార్యకర్తలు కూడా అనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసం గురించి తెలియజెప్పాలని కోరారు. టీడీపీ వారు చిన్న పని చేసి కొండంత ప్రచారం చేసుకుంటారని అన్నారు. మనం కూడా మారాలన్నారు. లెక్కలు కచ్చితంగా రాసుకొని తిరిగి అంతకు అంత ఇస్తామని హెచ్చరించారు. కేసులకు భయపడకుండా అందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు.