
జీవనంపై తీవ్ర ప్రభావం
ఉపాధి హామీ పని అడిగిన అందరికీ పని కల్పించాలి. పనిదినాల సంఖ్య తగ్గింపు వల్ల జిల్లా కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం ఎవరి సొంతం కాదు. ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న పథకం. రాజకీయాలకు అతీతంగా గ్రామాల్లో పనులు జరిపించాలి. ప్రతి కుటుంబానికి వంద రోజు లు పని దినాలు కల్పించాలి, వారం వారం వేతనాలు అందివ్వాల్సిందే. రాజకీయ కోణంలో పని కల్పించకపోతే ఐక్యంగా కలిసి పోరా డుతాం. కామన్ వర్క్ ఐడీలు కాకుండా ఏ పనికి ఆ పనికి సంబంధించిన ఐడీలు ఇవ్వాలి. దీనివల్ల పని చేసిన వారు, చేయని వారు సమానమై వేతనం తగ్గిపోయే ప్రమాదం ఉంది.
– గంజిమాల రవిబాబు, వ్యవసాయ కార్మి సంఘం పల్నాడు జిల్లా నాయకుడు