జీఎస్టీతో వేగంగా ఆర్థికాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

జీఎస్టీతో వేగంగా ఆర్థికాభివృద్ధి

May 30 2025 1:26 AM | Updated on May 30 2025 1:26 AM

జీఎస్టీతో వేగంగా ఆర్థికాభివృద్ధి

జీఎస్టీతో వేగంగా ఆర్థికాభివృద్ధి

లక్ష్మీపురం: వస్తు సేవల పన్నుతో దేశం వేగంగా ఆర్థికంగా ముందుకు వెళుతుందని, పన్ను వ్యవస్థ పూర్తిగా చక్కబడిందని సెంట్రల్‌ జీఎస్టీ కమిషనర్‌ సుజిత్‌ మల్లిక్‌ అన్నారు. గురువారం గుంటూరు కన్నవారితోటలోని జీఎస్టీ భవన్‌లో ప్రీ జీఎస్టీ డే వేడుక నిర్వహించారు. కమిషనర్‌ మాట్లాడుతూ జీఎస్టీతో పన్నులను అంగీకరించే సమాజం ఏర్పడిందన్నారు. పన్ను చట్టాల్లో పారదర్శకత పెరగటమే కాకుండా, పన్ను అధికారులకు, పన్ను చెల్లింపుదారుల మధ్య స్నేహభావం ఏర్పడిందన్నారు. ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం, పన్ను చెల్లింపులు పెంచడం వంటి అంశాలలో జీఎస్టీ ప్రాధాన్యతను వివరించారు. జీఎస్టీ విజయవంతంగా అమలు కావడంలో పరిశ్రమ భాగస్వాముల సహకారాన్ని అభినందించారు. జీఎస్టీ అడిషనల్‌ కమిషనర్‌ బి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జీఎస్టీ ప్రయాణాన్ని గుర్తుచేసే ఒక ముఖ్యమైన కార్యక్రమంగా ఈ వేడుక నిర్వహిస్తున్నామన్నారు. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కరరావు మాట్లాడుతూ జీఎస్టీ ప్రారంభంలో తెలియక చాలా మంది వ్యాపారులు తమ రిటన్స్‌లో తప్పుడు వివరాలు నమోదు చేశారని, ప్రస్తుతం జీఎస్టీ ఆడిట్‌లో అవన్నీ పట్టుబడుతున్నాయన్నారు. అవి కావాలని చేసిన తప్పులు కావన్నారు. నేషనల్‌ కనూ్‌స్య్‌మర్స్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షుడు చదలవాడ హరిబాబు మాట్లాడుతూ ప్రాణ రక్షణ కోసం వాడే మందులపై జీఎస్టీని తక్షణమే తీసివేయాలన్నారు. చేనేత మగ్గాలపై విధించే ఐదు శాతం పన్నును కూడా రద్దు చేయాలన్నారు. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ జిల్లా అధ్యక్షుడు యేల్చూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జీఎస్టీపై వ్యాపారుల ఇబ్బందులను ప్రతి మూడు నెలలకొకసారి సమీక్ష చేయాలన్నారు. ఇండియన్‌ టెక్స్‌టైల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ రేట్లలో రెండు స్లాబులే ఉండాలని సూచించారు. పలువురు పరిశ్రమ ప్రతినిధులు తమ అభిప్రాయాలను తెలిపారు. కమిషనర్‌ సుజిత్‌ మల్లిక్‌ను ట్రేడ్‌ వర్గాలు సన్మానించాయి. జీఎస్టీ అసిస్టెంట్‌ కమిషనర్లు ఎం.నాగరాజు, బి.రవికుమార్‌, వి.వెంకటేశ్వరరావు, మనోజ్‌కుమార్‌, మరియదాసు, రాయలు, ఆనందరావు, చాంబర్‌ మాజీ అధ్యక్షుడు ఎ.ఆంజనేయులు పాల్గొన్నారు.

సెంట్రల్‌ జీఎస్టీ కమిషనర్‌ సుజిత్‌ మల్లిక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement