
ఉచిత మోడల్ లాసెట్ పోస్టర్ ఆవిష్కరణ
నగరంపాలెం: లాసెట్ అభ్యర్థులకు ఉచిత మోడల్ లాసెట్ ఎంతగానో ఉపయోగకరమని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రొసిక్యూషన్ ఎండీ.బర్కత్ అలీ అన్నారు. ఏపీ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఉచిత మోడల్ లాసెట్ పోస్టర్‌ను గురువారం నగరంపాలెంలోని ఆయన కార్యాలయంలో అడిషనల్ పబ్లిక్ ప్రాసెక్యూటర్స్ పల్లపు కృష్ణ, బి.కోటేశ్వరరావు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, స్పాట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శి ఎ.శేషగిరిరావులు ఆవిష్కరించారు. శేషగిరిరావు మాట్లాడుతూ ఈ పరీక్షను జూన్ ఒకటిన గుంటూరు శ్యామలానగర్ ఒకటో వీధిలోని మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నిర్వహిస్తామని అన్నారు. ఉదయం పది గంటలకు పరీక్ష మొదలువుతుందని, మరిన్ని వివరాలకు 8297483785 నంబర్‌కు సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కొండవీటి శ్రీనివాసరావు, కె.వీరభాస్కర్, న్యాయవాదులు కె.నారాయణ చిన్న, జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.
హత్య కేసులో రిమాండ్
బల్లికురవ: మండలంలోని కొమ్మినేనివారి పాలెంలో గత ఏడాది అక్టోబర్ 4న జరిగిన హత్య కేసులో నిందితుడు పి. నారాయణ రెడ్డికి అద్దంకి కోర్టు న్యాయమూర్తి బుధవారం 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై వై. నాగరాజు తెలిపారు.