
జీఓ నెంబర్ 30 అమలు చేయాలి
గత 20ఏళ్లుకు పైబడి నివాసం ఉంటున్న బాపనయ్యనగర్ వాసుల గృహాలకు పట్టాలు ఇవ్వాలి. సెంటు స్థలం లేని పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజలు అధికంగా అక్కడ ఉన్నారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేసుకొని గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఇంటి పన్నులు సైతం కడుతున్నారు. ప్రభుత్వం జీఓ నెంబర్ 30 తీసుకువచ్చి 150 కుటుంబాల ఆక్రమితదారులకు హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది.
– డాక్టర్ గోదా జాన్‌పాల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, బాపనయ్యనగర్ వాసులు