ముగిసిన సీఎం కప్‌ క్రీడలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన సీఎం కప్‌ క్రీడలు

May 6 2026 7:43 AM | Updated on May 6 2026 7:43 AM

మల్కన్‌గిరి: స్థానిక స్టేడియంలో జరిగిన సీఎం ట్రోఫీ క్రీడలు ప్రశాంతంగా ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ బలభద్ర మాఝి మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం లభిస్తుందన్నారు. 2036 నాటికి దేశంలో ఒలింపిక్స్‌ నిర్వహించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నారని, అందువలన గిరిజన ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో ప్రతిభ గుర్తించడం ఎంతో అవసరమన్నారు. క్రీడల్లో 7 సమితుల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మహిళా ఖో–ఖో పోటీల్లో విజేతగా బలిమెల జట్టు, రన్నరప్‌గా చిత్రకొండ, పురుషుల విభాగంలో బలిమెల జట్టు విజేతగా, పోడియా జట్టు రన్నరప్‌గా నిలిచింది. కబడ్డీ పురుషుల విభాగంలో మల్కన్‌గిరి విజేతగా నిలిచింది. అలాగే వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రథమేశ్‌ అర్వింద్‌ రాజశిర్కే, మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్‌ మాడ్కామి, చిత్రకొండ ఎమ్మెల్యే మాంగుఖీలో, సబ్‌ కలెక్టర్‌ దుర్యోదున్‌ బోయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement