భువనేశ్వర్: పశ్చిమ ఒడిశా బొలంగీర్ జిల్లాలో నీటి కోసం ప్రజలు కటకటలాడుతున్నారు. ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి నివారణకు అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. అత్యంత అవసరమైన తాగునీరు కల్పించలేని దయనీయ పరిస్థితుల్లో దైనందిన జీవనం దుర్భరం అవుతుందని ఆగ్రహించిన స్థానికులు తాగునీటి పంపిణీ శాఖ అదనపు చీఫ్ ఇంజినీర్‌ని ముట్టడించారు. దీనిలో భాగంగా మహిళలు ఖాళీ మట్టి కుండలను చీఫ్ ఇంజినీర్ టేబుల్‌పై ఉంచి నిరసన తెలిపారు. నీటి ఎద్దడి ఇక్కట్లు అధికారికి వివరించారు. దీనిపై అధికారులు స్పందించడం లేదని వాపోయారు. తమ సమస్యను ఇప్పటికై నా పరిష్కరించాలని కోరారు.


