హైటెక్‌ ఆరోగ్య సేవల్లో మరో ముందడుగు | - | Sakshi
Sakshi News home page

హైటెక్‌ ఆరోగ్య సేవల్లో మరో ముందడుగు

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

భువనేశ్వర్‌: ఆరోగ్య సంరక్షణ రంగంలో హై టెక్‌ మెడికల్‌ కాలేజ్‌, హాస్పిటల్‌ మరో ముఖ్యమైన ముందడుగు వేసింది. హైటెక్‌ వైద్య బోధన ఆస్పత్రి ప్రాంగణంలో 13 కె.ఎల్‌. ద్రవ వైద్య ఆక్సిజన్‌ ప్లాంట్‌ను మంగళ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి హై టెక్‌ గ్రూప్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ తిరుపతి పాణిగ్రాహి ముఖ్య అతిథిగా హాజరై ప్లాంట్‌ను ప్రారంభించారు. హై టెక్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ ట్రస్టీ మరియు సీఈఓ సురేష్‌ కుమార్‌ పాణిగ్రాహి, మరియు ట్రస్టీ డాక్టర్‌ రాకేష్‌ కుమార్‌ పాణిగ్రాహి గౌరవ అతిథులుగా హాజరు అయ్యారు. రోగులకు నిరంతరాయంగా అధిక నాణ్యత గల ఆక్సిజన్‌ సేవలను అందించడమే ఈ కొత్త ఆక్సిజన్‌ ప్లాంట్‌ యొక్క ప్రధాన లక్ష్యమని డాక్టర్‌ తిరుపతి పాణిగ్రాహి తెలిపారు. ఈ కొత్త ప్లాంట్‌ ఏర్పాటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులకు సకాలంలో ఆక్సిజన్‌ను అందుతుందని ఆయన అన్నారు. ఇది ముఖ్యంగా అత్యవసర పరిస్థితులలో మెడికల్‌ కాలేజీ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని మేనేజింగ్‌ ట్రస్టీ సురేష్‌ కుమార్‌ పాణిగ్రాహి తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆసుపత్రి సీఓఓ జ్యోతిమయ్‌ పండాతో పాటు పలువురు సీనియర్‌ వైద్యులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు హాజరు అయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement