శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని పెద్ద రెల్లివీధిలో జిల్లా మాజీ సైనికుల సమాఖ్య సర్వసభ్య సమావేశాన్ని ఆదివారం నిర్వహించినట్లు జిల్లా అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు తెలియజేశారు. సభను కోశాధికారి ఎం.సింహాచలం ఫెడరేషన్ జమా ఖర్చుల వివరాలతో ప్రారంభించారు. జనరల్ సెక్రటరీ పైడి మురళీధరరావు మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన పనులను వివరించారు. అనంతరం అధ్యక్షుడు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఇటీవల కార్గిల్ పార్క్‌ను శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించి జిల్లాలోని సైనికులకు స్ఫూర్తిని నింపడంపై నాయకులు, అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ పైడి మురళీధరరావు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎస్.రామకృష్ణ, కోశాధికారి ఎం.సింహాచలం, గౌరవ ప్రెసిడెంట్లు తమ్మినేని కృష్ణారావు, టి.కృష్ణారావు, ఎస్.ఎల్.రావు, మహిళా సెక్రటరీలు కె.జగ్గమ్మ, డి.భారతి, అడ్వైజర్లు ఎ.వి.జగన్‌మోహన్ రావు, పి.రామారావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు పి.జమున, మెట్ట ఈశ్వరమ్మ, డి.రత్నమాల, బి.రాంబాబు, డి.వాసుదేవరావు, ఎన్.లక్ష్మీ నారాయణ, ఎం.రాములు, పి.శ్రీనివాసరావు, పి.చిన్నారావు, ఎం.నాగభూషణరావు, ఎస్.అప్పలసూరి, కె.రాజశేఖర్, వి.గౌరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.


