ఉత్సాహంగా చెస్‌ ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా చెస్‌ ఎంపిక పోటీలు

Mar 30 2026 7:28 AM | Updated on Mar 30 2026 7:28 AM

ఉత్సాహంగా చెస్‌ ఎంపిక పోటీలు

శ్రీకాకుళం న్యూకాలనీ: నగరంలో కొత్తరోడ్‌లోని కాశ్యప్‌ నర్సింగ్‌ కళాశాల వేదికగా ఆదివారం జరిగిన జల్లాస్థాయి అండర్‌–9 చెస్‌ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి బాలబాలికలు హాజరై ప్రతిభ కనబర్చారు. ఈ ఎంపిక పోటీల్లో బాలురు విభాగంలో అన్నెపు శశాంక్‌, శనుగును శివ, సనపల రిత్విక్‌సాయి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో లిపిక కారుణ్య, కొల్ల భవిష్య, రేష్మిక మొదటి మూడు స్థానాల్లో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికై న వీరంతా ఏప్రిల్‌ 18, 19 తేదీల్లో అన్నవరం వేదికగా జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి అండర్‌–9 బాలబాలికల చెస్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరుపున ప్రాతినిధ్యం వహిస్తారని ఆలిండియా చెస్‌ ఆన్‌ స్కూల్‌ కమిటీ సభ్యుడు సనపల భీమారావు తెలిపారు. అంతకుముందు ఈ ఎంపిక పోటీలను తంగుడు సుధీర్‌ మొదటి ఎత్తువేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బగాది కిషోర్‌, కార్యదర్శి జామి రమేష్‌, సంఘ ప్రతినిధులు, కోచ్‌లు పాల్గొన్నారు.

మత్స్యానందం..!

సాధారణంగా చేప 1 కిలో నుంచి 3 కిలోల వరకు ఉంటుంది. 5 కిలోలు ఉంటే గొప్పగా చూస్తారు. అటువంటిది ఏకంగా 16 కిలోల చేప ఎల్‌ఎన్‌పేట మండలంలోని చింతలబడవంజలో పట్టుబడింది. గ్రామస్తులు చెరువులో చేపలు పెంచుతున్నారు. ఆదివారం చేపల కోసం వలలు వేయగా 16 కిలోల చేప దొరికింది. దీంతో ఆశ్చర్యానికి గురయ్యారు.

– హిరమండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement