42 వినతుల స్వీకరణ
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో 42 వినతులు అందినట్లు అధికారులు వెల్లడించారు. బొరిగుమ్మ పంచాయతీ సమితి కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన శిబిరంలో జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యభాన్ మహాజన్ ముఖ్యఅతిథిగా హాజరై వినతులు స్వీకరించారు. 27 వినతులు వ్యక్తిగతం కాగా 15 సామూహిక సమస్యలపై వచ్చినవి ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అనంతరం ఇద్దరు దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ మహాజన్ వీల్‌చైర్లు, 29 మహిళా స్వయం సహాయక గ్రూపులకు రూ. 1.59 కోట్ల రుణాల చెక్కులను అందజేశారు. జయపురం సబ్‌కలెక్టర్ అక్కవరం శొశ్యా రెడ్డి, జిల్లా ఎస్పీ రోహిత్ వర్మ, సీడీవో బేణుధర శబర, డీపీవో జుగల్ కిశోర్ నాయిక్, బొరిగుమ్మ సబ్‌డివిజన్ పోలీసు అధికారి సత్యబ్రత లెంక, జిల్లాసంక్షేమ అధికారి సునీల్ తండి, బీడీవో సుకాంత కుమార్ పట్నాయక్, బొరిగుమ్మ సమితి చైర్మన్ దీప్తిమయి నాయిక్ ఉన్నారు.


