పాములా అమ్మాయి ప్రవర్తన | - | Sakshi
Sakshi News home page

పాములా అమ్మాయి ప్రవర్తన

Jun 1 2025 12:45 AM | Updated on Jun 1 2025 12:45 AM

పాములా అమ్మాయి ప్రవర్తన

పాములా అమ్మాయి ప్రవర్తన

భువనేశ్వర్‌: మయూరభంజ్‌ జిల్లాలోని ఒక గ్రామంలో ఇటీవల ఒక అమ్మాయి ప్రవర్తన పామును పోలినట్లు ఉండడంతో అంతా దిగ్భ్రాంతి చెందారు. మయూరభంజ్‌ జిల్లా ఉదొలా మండలం చకరపాల్‌ గ్రామం నడి రోడ్డు మీద ఓ అమ్మాయి పాములా పాకుతూ పడగ విప్పి బుసలు కొడుతున్న దృశ్యం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే .... ఇటీవల మయూరభంజ్‌ జిలా ఉదొలా మండలం చకరపాల్‌ గ్రామంలోని రవీంద్ర సింగ్‌ ఇంట్లోకి ఒక విషపూరిత పాము ప్రవేశించింది. అది నాగు పాముగా గుర్తించి యజమాని కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశాడు. వారు వెంటనే స్నేక్‌ హెల్ప్‌లైన్‌ సభ్యులకు ఫోన్‌ చేసి సహాయం కోరారు. సమాచారం అందుకున్న స్నేక్‌ హెల్ప్‌లైన్‌ సభ్యులు ఇంటికి చేరుకుని పామును పట్టుకోవడానికి ప్రయత్నించారు. పాము చొరబడిన మట్టి గోడను వారు కొద్దిగా పగలగొట్టడం ప్రారంభించగానే, రవీంద్ర సింగ్‌ కూతురు మీనాక్షి అకస్మాత్తుగా నేలపై కుప్పకూలిపోయి బుసలు కొడుతూ, నేలపై దొర్లుతూ, పాములా ప్రవర్తించడం చూసిన వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతే కాకుండా తనను అక్కడి నుంచి తీసుకెళ్ల వద్దని, తనకు హాని చేయవద్దని దీనంగా అందరినీ వేడుకుంది. కొన్ని రోజుల కిందట ఆ కుటుంబం దృష్టిలో ఒక పాము తారస పడింది. వారు దాన్ని చాలాసార్లు కొట్టడానికి విఫలయత్నం చేశారు. పాము ఎలాగోలా తప్పించుకుంది. అయితే ఆశ్చర్యకరంగా ఆ అమ్మాయి శరీరంపై పాముకు కరల్రతో కొట్టిన గుర్తులను పోలిన గుర్తులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మీనాక్షి గతంలో నాగ పంచమి, వసంత పంచమి వంటి పవిత్ర సందర్భాలలో కూడా పాములా ప్రవర్తించిందని వారు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement