
‘బాకై ్సట్ తవ్వకాలు ఆపాల్సిందే’
రాయగడ: వేదాంత్ కంపెనీ జిల్లాలోని కాశీపూర్ సమితి కొడింగిమాలిలో గల బాకై ్సట్ నిక్షేపాలు తవ్వుకుంటూ వెళ్లిపోతోందని, ఇది ఆమోద యోగ్యం కాదని కొరాపుట్ లొక్‌సభ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక అన్నారు. మంగళవారం సమితి పరిధిలో గల పొడిపాడి పంచాయతీలోని మట్టికొన వద్ద వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు, నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారు. ఇప్పటికే వేదాంత్ కంపెనీ మూడు మిలియన్ టన్నుల బాకై ్సట్ తవ్వుకుని వెళ్లిపోయిందని, మరో 6 మిలియ్లు తవ్వుకునేందుకు ప్రభుత్వంతో మంతనాలు జరుపుతోందని అన్నారు. బాకై ్‌స్‌ట్ నిల్వలు అయిపోతే కంసారిగుడలో ఏర్పాటు చేయనున్న కర్మాగారానికి నిక్షేపాలు మిగలవని ఆందోళన వ్యక్తం చేశారు. వేదాంత కంపెనీ ఇకపై కొడింగిమాలిలో బాకై ్సట్ తవ్వకాలు చేపట్టకూడదని, లేదంటే ఆందోళన చేపట్టడం ఖాయమని అన్నారు. సమావేశంలొ కొరాపుట్ లొక్‌సభ మాజీ ఎంపీ జిన్ను హికక, రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక, కొరాపుట్ జిల్లాలొని లక్ష్మీపూర్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే పవిత్ర సామంత, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మాఝి, బీజేడీ సీనియర్ నాయకులు జగదీష్ పాత్రో, బినొద్ నాయక్, సమితి అధ్యక్షులు కొంఠొ మాఝి, సమాజసేవకుడు విద్యా దురియా తదితరులు పాల్గొన్నారు.