
పాముకాటుతో మహిళ మృతి
మల్కన్‌గిరి: పాముకాటుతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితి చితపరి పంచాయతీలో చోటుచేసుకోగా.. ఆంతురి కిర్షాని భార్య తారావతి కిర్షాని (40) ప్రాణాలు కోల్పోయింది. చితపరి గ్రామంలో నిసిస్తున్న ఆంతురి కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి భోజనాలు పూర్తి చేసి పదిగంటల సమయంలో నిద్రపోతుండగా తారావతి పెద్ద కేకలు వేసింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబీకులు లేచి చూసేసరికి విష సర్పం కన్పించింది. దీంతో శరీరాన్ని పరిశీలించగా తొడపై పాము కాటు వేసినట్టు గుర్తించారు. వెంటనే ఆమెను మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెంది. మృతురాలి సోదరుడు ఘెను బోడనాయక్ బలిమెల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఐఐసీ దీరాజ్ పట్నాయక్ కేసు నమోద్ చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.