
భవానీశంకర్ జెన్నకు రాజీవ్‌గాంధీ ప్రతిభా పురస్కారం
రాయగడ: స్థానిక సమాజ సేవకుడు, ట్రేడ్ యూనియన్ నాయకుడు భవానీశంకర్ జెన్నకు రాజీవ్ గాంధీ ప్రతిభా పురస్కార్ –25 అవార్డు లభించింది. ఒడిశా రాష్ట్ర రాజీవ్ గాంధీ స్టూడెంట్స్ ఫోరం ఆధ్వర్యంలో రాజధాని భువనేశ్వరలో బుధవారం స్వర్గీయ రాజీవ్ గాంధీ 34వ వర్ధంతిని పురస్కరించుకుని జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అవార్డును జెన్నకు అందజేశారు. పీసీసీ అధ్యక్షుడు భక్తచరణ్ దాస్, ఉత్కల్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ బినాయక్ కర్, ఓఆర్‌జీఎస్‌ఎఫ్ అధ్యక్షుడు సత్యబ్రత నాయక్ సమక్షంలో అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా జెన్నకు పలువురు అభినందించారు.