
ముగిసిన అగ్నిగంగమ్మ పండుగ
రాయగడ: స్థానిక పిట్టలవీధిలో ఐదు రోజులుగా జరుగుతున్న అగ్నిగంగమ్మ అమ్మవారి వార్షిక పండుగ బుధవారంతో ముగిసిది. మంగళవారం రాత్రి పండుగలో ప్రధాన ఘట్టమైన మల్లెల్లో (నిప్పులపై) పూజారి నడిచే కార్యక్రమం జరిగింది. బుధవారం పండుగ సమయంలో స్థానిక కేఎన్‌కే సమీపంలోని అమ్మవారి పాదాల గుడి నుంచి తీసుకువచ్చిన పాదాలను తిరిగి అదే స్థానానికి తీసుకువెళ్లారు. మేళ తాళాలు, ఆదివాసీ సంప్రదాయ వాయిద్యాలతో అమ్మవారి ఘటాలతో పాటు పాలజంగిడిలో పాదాలను మోసుకుంటూ పాదాలగుడిలో నిలపడంతో పండుగ ముగిసింది. యువతకులు, వీధి ప్రముఖులు పెద్ద సంఖ్యలో నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు.

ముగిసిన అగ్నిగంగమ్మ పండుగ