
సమాచారం లేకుండా సమావేశాలకు ఎందుకు?
● అధికారులను నిలదీసిన ఎమ్మెల్యే
కొరాపుట్: సమగ్ర సమాచారం లేని అధికారులు సమావేశాలకు ఎందుకు వస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన జయపూర్ ఎంఎల్‌ఏ తారా ప్రసాద్ భాహీని పతి ప్రశ్నించారు. బుధవారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (దిశా) సమావేశంలో ఎమ్మెల్యే మండిపడ్డారు. కొరాపుట్, జయపూర్ పట్టణాలలో నిర్మితం అవుతున్న బైపాస్ రోడ్డు నిర్మాణ ప్రగతిని సభ్యులు అధికారులను ప్రశ్నించారు. జిల్లాలో ఏర్పాటవుతున్న సెల్ టవర్లు, జాతీయ రహదారు లు 26, 326ల సమస్యలు, భారత మాల ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణాల గురించి సభ్యులు వివరాలు అడిగారు. చాలా ప్రశ్నలకు అధికారులు తగిన సమాచారం లేదని బదులిచ్చారు. మరోసారి ఇలా వస్తే కుదరదని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. సమా వేశంలో కొరాపుట్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉల్క, కలెక్టర్ వి.కీర్తి వాసన్, జెడ్పీ ప్రెసిడెంట్ సస్మితా మెలక, ఎమ్మెల్యే పవిత్ర శాంత, రాం చంద్రఖడం, రఘురాం మచ్చో పాల్గొన్నారు.