
రైలు ఢీకొని వృద్ధుడు మృతి
కాశీబుగ్గ/ఇచ్ఛాపురం: పలాస జీఆర్పీ పరిధి ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ సమీపంలో బహుదా నది రైలు వంతెనపైన వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. వ్యక్తి వంతెన దాటుతున్న తరుణంలో ఒక్కసారిగా రైలు రావడంతో ఎటుపోవాలో తెలియక ఉండిపోవడం వలన ప్రమాదం చోటుచేసుకుందని జీఆర్పీ పోలీసులు భావిస్తున్నారు. వృద్ధుడి వయస్సు 65–70 సంవత్సరాలు మధ్య ఉంటుందని, తెల్లని రంగు షర్టు పైన నిలువుగా నల్లని గీతలు, ఎర్రని లుంగీ కట్టుకున్నారని తెలిపారు. పలాస జీఆర్పీ ఎస్‌ఐ షరీఫ్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తుపడితే 94406 27567 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.