
46,449
కేసులు పరిష్కారం
భువనేశ్వర్: జాతీయ లోక్ అదాలత్‌ను ఖుర్ధా జిల్లాలో శనివారం నిర్వహించారు. జాతీయ న్యాయ సేవల అథారిటీ, ఒడిశా రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ ఆధ్వర్యంలో ఖుర్దా జిల్లా పరిధిలోని భువనేశ్వర్, ఖుర్ధా, బొణొపూర్, జట్ని, టంగి, చిలికా, బెగుణియాలోని అన్ని జ్యుడీషియల్ డివిజనల్ కోర్టు సముదాయాలలో లోక్ అదాలత్ నిర్వహించారు. విచారణ కోసం మొత్తం 76,437 కేసులు దాఖలవ్వగా వాటిలో 46,449 కేసులను న్యాయమూర్తులు పరిష్కరించారు. అలాగే జరిమానా, పరిష్కారం, ఆదాయం వర్గాల కింద రూ. 26,27,08,395 వసూలు చేయాలని నిర్ణయించారు. ఖుర్ధా జిల్లా సెషన్స్, జిల్లా న్యాయ సేవల అథారిటీ, భువనేశ్వర్ చైర్మన్ బిరంచి నారాయణ్ మహంతి, ఫ్యామిలీ కోర్టు జడ్జి మదన్‌లాల్ కేడియా, నరేష్ మహంతి, అదనపు జిల్లా జడ్జిలు హిమాన్షు శేఖర్ మల్లిక్, శుభంజన్ మహంతి, వందన కొరొ మరియు ఇతర సీనియర్ న్యాయ అధికారులు లోక్ అదాలత్‌లో పాలుపంచుకుని రికార్డు సంఖ్యలో కేసులను పరిష్కరించారు.
లోక్ అదాలత్‌లో 7,142 కేసులు పరిష్కారం
జయపురం: స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా ప్రదీకరణల సూచనల మేరకు కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు నిర్వహించిన లోక్ అదాలత్‌లో 7,142 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ విషయాన్ని ప్రదీకరణ అధికారులు వెల్లడించారు. జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ అధ్యక్షులు, జిల్లా జడ్జి ప్రదీప్ కుమార్ మహంతి అధ్యక్షతన జిల్లాలోని కొరాపుట్, కొట్‌పాడ్, లక్ష్మీపూర్, సెమిలిగుడ, దసమంతపూర్, బొరిగుమ్మ, లమతాపుట్ కోర్టులలో కూడా లోక్ అదాలత్ నిర్వహించారు. ఇందులో 34 మోటార్ ప్రమాదాల కేసులు పరిష్కరించి బాధితులకు 2,05,20,000 రూపాయల పరిహారం సమకూర్చినట్లు వెల్లడించారు. అలాగే మిగతా 7,108 కేసులు పరిష్కరించి 4,58,50,538 రూపాయలను జరిమానా వసూలు చేశారు. కేసులు పరిష్కరించిన వారిలో కుటుంబ కోర్టు జడ్జి నిశిత్ నిశాంకో, లోక్‌అదాలత్ శాశ్వత విచారపతి సుమన్ జెన, రిజిష్టర్

46,449

46,449