సీఎం చంద్రబాబుకు మహిళలంటే చిన్నచూపు | - | Sakshi
Sakshi News home page

సీఎం చంద్రబాబుకు మహిళలంటే చిన్నచూపు

May 11 2025 12:18 PM | Updated on May 11 2025 12:18 PM

సీఎం

సీఎం చంద్రబాబుకు మహిళలంటే చిన్నచూపు

ఆల్‌ ఇండియా బీసీ ఫెడరేషన్‌ నాయకుడు లక్ష్మణరావు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): సీఎం చంద్రబాబుకి మహిళలంటే చిన్నచూపు అని ఆల్‌ ఇండియా బీసీ ఫెడరేషన్‌ నాయకుడు, వైఎస్సార్‌సీపీ కాళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు శనివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఏఐబీసీఎఫ్‌ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై పోలీసులు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. రాష్ట్రంలో మాజీ మంత్రి స్థాయి వ్యక్తికే సరైన సమాధానం చెప్పలేని పరిస్థితిలో పోలీసు యంత్రాంగం, కూటమి ప్రభుత్వం ఉందన్నారు. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానమని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు కొనసాగిస్తే ఆల్‌ ఇండియా బీసీ ఫెడరేషన్‌ తరుపున ఉద్యమించక తప్పదని హెచ్చరించారు.

సత్తాచాటిన కంచిలి యువతి

కంచిలి: మండల కేంద్రానికి చెందిన తాజుద్దీన్‌ ఖాన్‌ కుమార్తె జైనబ్‌ ఖానం అమెరికాలోని వాషింగ్టన్‌ డీసీలో ఉన్న ప్రతిష్టాత్మక అమెరికన్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీని పూర్తి చేసింది. దీంతో అదే యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా కూడా సేవలందిస్తోందని తండ్రి తాజుద్దీన్‌ ఖాన్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జైనబ్‌ ఖానం విద్యలో చూపిన ప్రతిభకు గుర్తింపుగా స్కాలర్‌షిప్‌ అందుకున్నారు. డేటా సైన్స్‌, మిషన్‌ లెర్నింగ్‌, డేటా అనాలిటిక్స్‌ వంటి అత్యాధునిక రంగాల్లో ప్రావీణ్యం సాధించారు. ఒక గ్రామీణ ప్రాంత యువతిగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించి, అదే విద్యాసంస్థలో అధ్యాపకురాలిగా మారడం విశేషం.

రోడ్డు ప్రమాదంలో

వ్యక్తి మృతి

టెక్కలి రూరల్‌: మండలంలోని శ్యామసుందరాపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిగాం మండలం ఆర్‌జే బొడ్డపాడు గ్రామానికి చెందిన బుడ్డ దశరథ(43) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు దశరథ కోటబొమ్మాళి మండలం గంగరాం గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు శుక్రవారం వెళ్లాడు. అనంతరం తిరిగి శనివారం ఉదయం ద్విచక్ర వాహనంపై తన గ్రామానికి వెళ్తున్న క్రమంలో టెక్కలి సమీపంలోని శ్యామసుందరాపురం గ్రామ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ విజయ్‌కుమార్‌ తెలిపారు. అయితే మృతుడికి మొదటి భార్య మృతి చెందడంతో ఇటీవలే రెండో వివాహం జరిగింది. మృతుడు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్‌ (ఆమదాలవలస) రైల్వేస్టేషన్‌లో మూడో నంబర్‌ ప్లాట్‌ఫారం వద్ద శనివారం సాయంత్రం రైలుకింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ ఎస్‌ఐ మధుసూదనరావు వివరాలు వెల్లడించారు. రేగిడి ఆమదాలవలస మండలం పుర్లె గ్రామానికి చెందిన రేగిడి సురేష్‌(28) రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుడు సురేష్‌ శ్రీకాకుళంలో ప్రైవేటు జాబ్‌ చేస్తున్నాడని, శుక్రవారం రేగిడి ఆమదాలవలసలో ఒక వివాహానికి హాజరై వస్తానని పనిచేసే వద్ద చెప్పి వెళ్లినట్లు సమాచారం. ఇంటికి వెళ్లి వచ్చిన సురేష్‌ ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. సురేష్‌ తమ తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కాగా, తండ్రి జగన్నాథం గతంలో మరణించినట్లు తెలిపారు. అటు భర్త, ఇటు కుమారుడు మృతి చెందడంతో తల్లి దిక్కులేనిది అయ్యిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. సురేష్‌ మృతికి కారణాలు తెలియాల్సి ఉందని జీఆర్పీ పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

సీఎం చంద్రబాబుకు  మహిళలంటే చిన్నచూపు 1
1/4

సీఎం చంద్రబాబుకు మహిళలంటే చిన్నచూపు

సీఎం చంద్రబాబుకు  మహిళలంటే చిన్నచూపు 2
2/4

సీఎం చంద్రబాబుకు మహిళలంటే చిన్నచూపు

సీఎం చంద్రబాబుకు  మహిళలంటే చిన్నచూపు 3
3/4

సీఎం చంద్రబాబుకు మహిళలంటే చిన్నచూపు

సీఎం చంద్రబాబుకు  మహిళలంటే చిన్నచూపు 4
4/4

సీఎం చంద్రబాబుకు మహిళలంటే చిన్నచూపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement