
విద్యార్థులకు అభినందన
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో పదో తరగతి బోర్డు పరీక్షల్లో సరస్వతి శిశు విద్యామందిర్ రెండు ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థినులు ప్రజ్యోతి చౌదరి (566/600), అంకితా పాడీ (553/600)ను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్టు శుక్రవారం ఉదయం సత్కరించారు. ఈ సత్కార సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన పారశెల్లి రామరాజు మాట్లాడుతూ, వచ్చే ఏడాది సరస్వతి శిశు విద్యామందిర్ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎక్కువ మంది ఫస్ట్ ర్యాంకులు సాధించి పర్లాకిమిడి ఖ్యాతి పెంచాలని కోరారు. ముఖ్యవక్తగా ప్రధాన ఆచార్యులు సరోజ్ పండా, పాతపట్నం ప్రభుత్వ పాఠశాల ఒడియా ఉపాధ్యాయులు భీమ్ సేన్ పండా, విశ్రాంత ఉపాధ్యాయులు గేదెల సుదర్శనరావు, ప్రమోద్ కుమార్ పాడీలు అతిథులుగా విచ్చేశారు. ఉత్తమ విద్యార్థులకు మెమోంటో, వెయ్యి రూపాయల నగదు బహుమతి అందించారు. తల్లిదండ్రులను, ప్రధాన ఆచార్యులు సరోజ్ పండాను పి.రామరాజు సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గురూజీ, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అభినందన