
గురండి ఆదర్శ రైతుకు కిసాన్ అవార్డు ప్రదానం
పర్లాకిమిడి: కేంద్ర ఆగ్రోఫారెస్ట్రీ పరిశోధన సంస్థ (కాఫ్రీ) ఝాన్సీ (ఉత్తర్ ప్రదేశ్) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గజపతి జిల్లా గురండి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు సంజయ్ జెన్నాకు కృషి వంశికి కిసాన్ అవార్డు–2024’ ఢిల్లీలో డైరెక్టర్ డాక్టర్ అరుణాచలం (కాఫ్రీ) గురువారం అందజేశారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) అనుబంధ సంస్థగా ఉన్న కేంద్ర ఆగ్రో ఫారెస్ట్రీ పరిశోధన సంస్థ, ఆదర్శ జెన్నా తన స్వగ్రామం గురండిలో కొద్దిపాటి వ్యవసాయ క్షేత్రంలో రసాయన ఎరువులు ఉపయోగించకుండా పంటలు పండించారు. అటవీ మొక్కలు, పశువులు, చేపల పెంపకం, వనాలు పెంచుతూ బయా డెవర్సిటీ డెవలప్‌మెంట్‌కు కృషి చేస్తున్నందుకు ఆయనకు ఈ కిసాన్ అవార్డును కేంద్ర ఆగ్రోఫారెస్ట్రీ పరిశోధన సంస్థ అందజేశారు. మాజీ సైనికుడు సంజయ్ జెన్నా గురండిలో రఘురాం పేరిట ఆగ్రోఫార్మ్‌ను కూడా ఏర్పాటు చేసి అటవీ అధికారులు, వ్యవశాయ అధికారులను ఆకర్షించడంతో వారు ఆయన పేరును కేంద్ర ఐకార్‌కు సిఽఫార్సు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ డాక్టర్ గురుబచన్ సింగ్, ఐకార్ అదనపు డైరెక్టర్ జనరల్ ఎ.వేల్‌మురుగన్, మాజీ డైరెక్టర్ డాక్టర్ పి.పి.చదుర్వేది, మాజీ డైరక్టర్ డాక్టర్ ఎస్.కె.ధ్యానీ, తదితరులు పాల్గొన్నారు.