
సమస్యలతో దేశం కొట్టుమిట్టాడుతోంది
జయపురం: భారత్ ప్రస్తుతం విపత్కర సమస్యలతో కొట్టు మిట్టాడుతోందని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ సాధారణ కార్యదర్శి తిరుమల్లయ్ రమణ(తమిళనాడు) అన్నారు. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఒడిశా యూనిట్ 13వ రాష్ట్ర సమావేశం బుధ, గురువారం కొరాపుట్ పట్టణం టౌన్ హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కొరాపుట్ జిల్లా ఆదివాసీ సంస్కృతులు ఉట్టిపడేలా అఖిల భారత యువజన సంఘం ర్యాలీ నిర్వహించారు. పలు ఆదివాసీ కళాకారులు తమ సాంప్రదాయ నృత్యాలతో అతిథులను ఆహ్వానించారు. అనంతరం టౌన్ హాలులో ఏర్పాటు చేసిన సాహిద్ లక్ష్మణ నాయిక్ వేదికపై జమ్మూ కశ్మీర్‌లోని పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. మరణించిన పర్యాటకులకు ప్రగాడ సంతాపం తెలుపుతూ రెండు నిమిషాల మౌనం పాటించారు. సమావేశంలో యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్ శెట్టి, కార్మిక నేత ప్రమోద్ కుమార్ మహంతి, యువజన నేత కుమార్‌జాని తదితరులు పాల్గొన్నారు.

సమస్యలతో దేశం కొట్టుమిట్టాడుతోంది