
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
రాయగడ: జిల్లాలో ఒక మలుపు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. కల్యాణ సింగుపూర్ నుంచి వస్తున్న దీపక్, బి.సొయిలు రివాల్ కొన గ్రామానికి సమీపంలోని ఉన్న మలుపు వద్ద ఎదురుగా మరో బైకుపై వస్తున్న గొవింద హుయికలు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో దీపక్ కుమార్ మహారాణ(23), కొలనార సమితి కొలటిగుడకు చెందిన గోవింద హుయిక (20)లు చనిపోయాగా.. మండుపాల బిసాయికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం