
అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తాం
జయపురం: మున్సిపాలిటీ పరిధిలో రేషన్ కార్డులు అందజేసే కార్యక్రమం గురువారం నిర్వహించారు. మున్సిలప్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి అధ్యక్షతన ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి హాజరయ్యారు. ఆహార సురక్షా పథకంలో ప్రతి వార్డు నుంచి ఒక్కొక్క లబ్ధిదారుని ఎంపిక చేసి వారికి కార్డులు అందజేశారు. పట్టణంలో ఎన్నో కుటుంబాల వారిని ఎంపిక చేసినా కేవలం కొద్ది మందికే పిలవటం పట్ల ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులందరినీ పిలువకుండా కేవలం వార్డుకు ఒక్కరినే ఎందుకు పిలిచారని మార్కిటింగ్ ఇన్‌స్పెక్టర్‌ను నిలదీశారు. వెంటనే కొత్త లబ్ధిదారులను రప్పించి కార్డులు అందజేయాలని ఆదేశించారు. అర్హలందరికీ రేషన్ కార్డులు అందజేస్తామన్నారు.
జయపురం సబ్‌కలెక్టర్, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి అక్కవరం శొశ్యా రెడ్డి, అదనపు కార్యనిర్వాహక అధికారి కృతిబాస్ సాహు, కౌన్సిలర్లు జస్‌పాల్ సింగ్, సింహాచల బిశాయి, మధుశ్మిత ఒరాన్, ఉషారాణి దండసేన, మమతా బిశ్వాల్, శాంతి నాయక్, దనిమా హరిజన్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.