
మానవతా విలువలు అవసరం
పర్లాకిమిడి: ఆర్.సీతాపురంలో సెంచూరియన్ వర్సిటీలో అధ్యాపకుల అభివృద్ధికి విశ్వ మానవతా విలువలు (యు.హెచ్.వీ) కార్యక్రమాన్ని క్యాంపస్‌లో వైస్ చాన్సలర్ సుప్రియా పట్నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రిజిస్ట్రార్ డాక్టర్ అనితా పాత్రో, డైరక్టర్ (అడ్మిన్) డాక్టర్ దుర్గాప్రసాద్ పాడీ, డీన్ (అగ్రికల్చర్ కళాశాల) డాక్టర్ సత్యప్రకాష్ నందా హాజరయ్యారు. గురువారం ఉదయం యోగా క్లాసులతో ప్రారంభమైంది. యోగావల్ల అధ్యాపకులు, పరిశోధకులకు భౌతికంగా, మానసికంగా ఎక్కువ శక్తి కలుగుతుందని అధికారులన్నారు. సుమారు 118 మంది పాల్గొన్న ఈ ఫ్యాకల్టీ, పరిశోధకుల కార్యక్రమంలో విశ్వ విద్యాలయం కో ఆర్డినేటరు డాక్టర్ ప్రదీప్ కుమార్ సాహు, డాక్టర్ బాలాజీ పాడీ, ద్వితీసుందర్ రౌత్, ఏ.ఐ.సి.టి.ఈ ప్రాంతీయ కోఆర్డినేటరు డాక్టర్ దిలీప్ దేవానాథ్ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌తో పాటు ఇథికల్, విశ్లేషణ, అధ్యాపకుల టీచింగ్‌లో మానవతా విలువలు గురించి ఏ.ఐ.సి.టి.ఈ అధికారులు తెలియజేస్తారు.