
కొత్త రిజర్వేషన్ టికెట్ కౌంటర్ ఏర్పాటు
విపత్తు నిరోధక రోడ్లు రాష్ట్రంలో విపత్తు నిరోధక రోడ్లు నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రకటించారు.
–10లోu
వ్యాపారి కిడ్నాప్ గుట్టురట్టు
జయపురంలో వ్యాపారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను పట్టుకున్నారు.
భువనేశ్వర్: ప్రయాణికుల సౌకర్యానికి భువనేశ్వర్ న్యూ రైల్వే స్టేషన్‌లో కొత్త రిజర్వేషన్ రిజర్వేషన్ కేంద్రం (పీఆర్‌ఎస్) ఏర్పాటు చేస్తున్నారు. ఈ కేంద్రం ఈ నెల 12వ తేదీ నుంచి ఆరంభం అవుతుందని ఖుర్దారోడ్ రైల్వే మండలం ప్రకటించింది. ఈ కేంద్రం సోమవారం నుంచి శనివారం వరకు 6 పని దినాలలో నిత్యం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిరవధికంగా పని చేస్తుంది. దీనితో ఉత్తర భువనేశ్వర్, అఠొగొడొ, కటక్ ప్రాంతాల ప్రయాణికులకు ఈ రిజర్వేషన్ కేంద్రం లబ్ధి చేకూర్చుతుంది. ప్రస్తుతం 11 జతల ప్రయాణికుల రైళ్లు భువనేశ్వర్ న్యూ స్టేషన్‌లో ఆగుతున్నాయి. ఈ నెల 12 నుంచి మరో మూడు జతల ఎక్స్‌ప్రెస్ రైళ్లు భువనేశ్వర్, సీఎస్‌ఎంటీ ముంబై మధ్య నడుస్తున్న 11020/11019 కోణార్క్ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్, సికింద్రాబాద్ మధ్య రాకపోకలు చేస్తున్న 17015/17016 విశాఖ ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్, విశాఖపట్నం మధ్య రవాణా అవుతున్న 22819/22820 ఇంటర్ సిటీ సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రస్తుత భువనేశ్వర్ ప్రధాన స్టేషన్‌కు బదులుగా భువనేశ్వర్ న్యూ స్టేషన్‌లో ప్రారంభమై ముగుస్తాయి. పీఆర్‌ఎస్ మూసివేత భువనేశ్వర్ న్యూ స్టేషన్ ప్రాంగణంలో కొత్త పీఆర్‌ఎస్ ప్రారంభంతో బారంగ్ రైల్వే స్టేషనులో పని చేస్తున్న ప్యాసింజర్ రిజర్వేషన్ టికెట్ కౌంటర్ మూసి వేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ రోల 10వ తేదీ నుంచి ఈ కేంద్రం మూసివేస్తారు.