
పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
జయపురం: చారిత్రాత్మక జగన్నాథ్ సాగర్‌ను రాష్ట్రంలోని అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. గురువారం నిర్వహించిన జగన్నాథ్ సాగర్ పునరుద్ధరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూ.8.40 కోట్ల వ్యయంతో సాగర్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. నిరంతరం పనిచేసి నిర్ధారిత 6 నెలల సమయంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సాగర్‌లోని 147 ఎకరాల్లో బురద తొలగించేందుకు అనుమతి లభించిందని కార్యనిర్వాహక అధికారి అక్కవరం శొశ్య రెడ్డి వెల్లడించారు. గతంలో 47 ఎకరాల్లో బురద, మట్టి తొలగించడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ వి.కార్తీక వాసన్ మాట్లాడుతూ.. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కంట్రాక్ట్ సంస్థకు ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నరేంద్రకుమార్ మహంతి, కౌన్సిలర్లు విష్ణు వర్ధన రెడ్డి, రవీంద్ర కుమార్ సాహు, మున్సిపాలిటీ ఇంజినీర్ అజయ కుమార్ జాని, ప్రతాప్ చంద్ర ఆచార్య తదితరులు పాల్గొన్నారు.
● ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి

పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం