
పర్లాకిమిడిలో రథయాత్రకు సన్నాహాలు
పర్లాకిమిడి: వచ్చే నెలలో జరగనున్న శ్రీజగన్నాథ రథయాత్రకు స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్‌లో ముందస్తు సమావేశం, సమీక్ష కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశానికి అతిథిగా మోహనా ఎమ్మెల్యే దావరథి గోమాంగో, సబ్ కలెక్టర్ అనుప్ పండా, సబ్‌డివిజనల్ పోలీసు అధికారి మాధవానంద నాయక్, తహసీల్దారు నారాయణ బెహరా, సీనియర్ సిటిజన్ పూర్ణచంద్ర మహాపాత్రో, రథయాత్ర కమిటీ సభ్యులు, ఇతరులు పాల్గొన్నారు. గత రథయాత్ర పర్లాకిమిడిలో శాంతియుతంగా జరుపుకున్నామని, అప్పటి జమాఖర్చులు సబ్‌కలెక్టర్ అనుప్ పండా సభకు వివరించారు. ఈ ఏడాది రథయాత్రకు రథాల నిర్మాణం, కలప ఆవశ్యకత ఉందని రథయాత్ర కమిటీ కలెక్టర్ దాస్‌కు వివరించారు. రథయాత్ర జరుగు గుండిచా మందిరం వద్ద మీనాబజార్, జెయింట్ వీల్స్‌కు టెండర్లు పిలవడం, అలాగే రథయాత్ర ప్రసాద కమిటీకి కూడా టెండర్లు పిలవాలని కలెక్టర్ ఆదేశించారు. రథయాత్రలో పారిశుద్ధ్య వ్యవస్థ, తాగునీరు, ప్రజలకు పోలీసు భధ్రత, అంబులెన్సు, అగ్నిమాపకదళం వంటివి ఏర్పాటు చేయాలని ఆయా శాఖలకు కలెక్టర్ ఆదేశించారు. అలాగే రథయాత్ర కమిటీలో కొన్ని మార్పులు చేశారు. రథయాత్రలో ట్రాఫిక్ వేరే వైపు మళ్లింపు, శాంతి భద్రతలు కాపాడటానికి పోలీసు అధికారులను ఆదేశించారు.