
ఒంటరి పెద్దలకు సహాయం
భువనేశ్వర్: వయో వృద్ధులకు సకాలంలో సహాయం అందజేసేందుకు పూరీ పోలీసులు ముందుకు వచ్చారు. ప్రధానంగా వేరే పెద్ద దిక్కు లేకుండా ఒంటరిగా ఇండ్లలో ఉంటున్న వయో వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయంలో స్థానిక వయో వృద్ధులతో ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. వారి సమస్యల్ని పరిశీలించి నిరంతరం సత్వర సహాయం అందుబాటులో ఉంటుందని అభయం ఇచ్చారు. సీనియర్ సిటిజన్లు ఏవైనా సమస్యలను నివేదించడానికి లేదా సహాయం కోరడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 6370972100 పని చేస్తుందన్నారు.

ఒంటరి పెద్దలకు సహాయం