
రూ.6 కోట్లతో పపడాహండి అభివృద్ధి
కొరాపుట్: రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూ.6 కోట్లతో నబరంగ్‌పూర్ జిల్లా పపడాహండి సమితి టురి నది ఒడ్డున, జాతీయ రహదారి పక్కన సమరయోధుల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమ, మైనారిటీ, ప్రాథమిక విద్యాశాఖా మంత్రి నిత్యానంద గొండో ప్రకటించారు. సోమవారం పపడాహండిలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఈ నిధులతో ప్రభుత్వం చేపడుతున్న పనుల గూర్చి వివరించారు. 1942 ఆగస్టు 24న బ్రిటిష్ వారి తుపాకీ తూటాలకు 26 మంది స్వాతంత్య్ర సమరయోధులు బలైన విషయం గుర్తు చేశారు. నాటి బలిదానాకికి గుర్తుగా అక్కడ భారీ స్థూపం ఉందన్నారు. ఇప్పడు ఈ నిధులతో అక్కడ పరిశోధన కేంద్రం, పార్క్, మీటింగ్ హాల్, మ్యూజియం ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మనోహర్ రంధారి, గౌరీ శంకర్ మజ్జి, మాజీ ఎంపీ పరశురాం మజ్జి, మున్నా త్రిపాఠి, తదితరులు పాల్గొన్నారు.

రూ.6 కోట్లతో పపడాహండి అభివృద్ధి