
రంగస్థల వేదిక త్వరలో ప్రారంభిస్తాం
● కలెక్టర్ బిజయ కుమార్ దాస్
● పర్లాకిమిడిలో రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు ప్రారంభం
పర్లాకిమిడి: పర్లాకిమిడిలో కళాకారులకు కొరత లేదని, నాటకాలు ప్రదర్శించేందుకు రంగస్థల వేదిక లేదని, త్వరలో బెత్తగుడ వద్ద నిర్మాణం పూర్తవుతుందని జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. స్థానిక టౌన్‌హాల్‌లో 11వ రాష్ట్ర స్థాయి నాటక మహోత్సవాలను ఆదివారం ప్రారంభించారు. ఈ నాటక మహోత్సవాలకు ప్రఖ్యాత రంగస్థల నటులు అశోక్ కోరో, మోహనా ఎమ్మెల్యే దాశరథి గోమాంగో, మాజీ ఎమ్మెల్యే కోడూరు నారాయణరావు, జిల్లా సాంస్కృతిక అధికారి అర్చనా మంగరాజ్, పృథ్వీరాజ్, నిర్వాహకులు క్రియేటివ్ ఆర్ట్స్ నృసింహచరణ్ పట్నాయక్, కార్యదర్శి మనోజ్ పాడీ, ఆదర్శదాస్ తదితరులు ప్రసంగించారు. తొలి రోజు ‘శేషో ఇచ్చా’ (చివరి కోరిక ) నాటకాన్ని కళాకారులు ప్రదర్శించారు. ఈ నాటకానికి దర్శకత్వం మనోజ్ కుమార్ పాడి, నాట్యకారులు ప్రభాకర్ కోరో, సంగీతం రఘనాథ పాత్రో, సహదర్శకులు ఆదర్శదాస్ వ్యవహరించారు. ఈ నాటక ప్రదర్శనలు మూడు రోజుల పాటు సాగుతాయి.

రంగస్థల వేదిక త్వరలో ప్రారంభిస్తాం