
కోపరేషన్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ పర్యటన
కొరాపుట్: రాష్ట్ర కోపరేషన్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ, కొరాపుట్ జిల్లా నోడల్ అధికారి రాజేష్ ప్రభాకర్ పాటీల్ కొరాపుట్ జిల్లాలో శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఆరు అంచెల ఎకనామిక్ కారిడర్ భారత మాల రోడ్డు నిర్మాణంలో భాగంగా పర్వత టన్నెల్ సందర్శించారు. అతి పెద్ద వాటర్ సప్‌లై ప్రాజెక్ట్, రాజపుట్‌లో మిలిట్ ప్రోసెసింగ్ సెంటర్, పెట్టెరులో రూరల్ ఇండస్ట్రీయల్ పార్క్‌లను సందర్శించి వాటి పురోగతిని సమీక్షించారు. గతంలో ఈ ప్రాంతంలో కలెక్టర్‌గా పనిచేయడంతో రాజేష్ రాకతో అధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. పలు చోట్ల ప్రజలు వినతులు ఇచ్చారు. పర్యటనలో జయపూర్ సబ్ కలెక్టర్ అక్కవరం సశ్యా రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు.

కోపరేషన్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ పర్యటన