శ్రీకాకుళం న్యూకాలనీ: క్రీడాకారులకు గెలుపోటముల కంటే, క్రీడాస్ఫూర్తిని కనబర్చి, క్రమశిక్షణతో మెలగడం ముఖ్యమని శ్రీకాకుళం జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి తెలిపారు. జిల్లా సీనియర్స్ పురుషులు, మహిళల బాస్కెట్‌బాల్ బాల్ జట్ల ఎంపిక పోటీలు గురువారం శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ మైదానం వేదికగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరై ఎంపికలను ప్రారంభిన ఎమ్మెస్సా ర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా క్రీడల ఖిల్లాగా పేరుగాంచిన విషయాన్ని క్రీడాకారులకు వివరించారు. జిల్లాలో బాస్కెట్‌బాల్‌కు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు సమష్టిగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు.
29 నుంచి మార్టేరులో రాష్ట్ర స్థాయి పోటీలు..
ఏపీ రాష్ట్ర స్థాయి సీనియర్స్ పురుషులు, మహిళల బాస్కెట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలు మార్టేరు వేదికగా ఈనెల 29 నుంచి జరగనున్నాయని ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే శ్రీకాకుళం జిల్లా జట్ల ఎంపికలను ఇక్కడ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎంపిౖకైన జిల్లా ప్రాబబు ల్స్ క్రీడాకారులకు శిక్షణ శిబిరాలను నిర్వహించి త్వరలో జాబితాను వెల్లడిస్తామన్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఏ బాస్కెట్‌బాల్ కోచ్ జి.అర్జున్‌రావురెడ్డి, జీఎంఆర్ కాలేజ్ నుంచి స్వాతి, బాస్కెట్‌బాల్ సంఘ ప్రతినిధులు రాజు, హమీద్, లవకుమార్, ప్రవీణ్, యు.రవి, కొర్లయ్య, మురళి, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.