విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Apr 14 2026 8:52 AM | Updated on Apr 14 2026 8:52 AM

మంగళవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 ట్రాఫిక్‌ ఏసీపీగా శ్రీవేద ఈవీఎం గోడౌన్‌ తనిఖీ –8లోu భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం ఉచిత ప్రసాద వితరణకు రూ. 2 లక్షల విరాళం 18నుంచి కొండపల్లి బొమ్మల మేళా గురుకుల పాఠశాలలో మంత్రి తనిఖీ ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించాలి ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఆయా రంగాలను విస్మరిస్తే పేదలు అప్పుల బారిన పడే అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం ప్రభుత్వాస్పత్రుల్లో అందుతుందనే భరోసా కల్పించారు. ఆ భరోసాను కొనసాగించాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉంది. – డాక్టర్‌ మెహబూబ్‌ షేక్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌ సీపీ, వైద్య విభాగం లబ్బీపేట(విజయవాడతూర్పు): రెండేళ్ల చంద్రబాబు పాలనలో ప్రభుత్వ వైద్య రంగం పూర్తిగా నిర్వీర్యమైంది. కార్పొరేట్‌పై చూపిస్తున్న శ్రద్ధ ప్రభుత్వాస్పత్రులపై చూపకపోవడంతో వైద్య సేవలు దిగజారాయి. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించడంలో సర్కార్‌ విఫలమైంది. దీంతో ప్రభుత్వాస్పత్రులకు రావాలంటేనే ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకు ఓపీలు తగ్గడమే నిదర్శనంగా చెప్పవచ్చు. అంతేకాదు పీహెచ్‌సీల్లో ప్రసవాలు అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు నిలిచిపోయాయి. గ్రామానికి, ఇంటికే వెళ్లి వైద్య సేవలు అందించే ఫ్యామిలీ ఫిజీషియన్‌, ఆరోగ్య సురక్ష కార్యక్రమాలకు మంగళం పలికారు. ఆపద వస్తే కుయ్‌ కుయ్‌ మంటూ వెళ్లే 108 వాహనాలు నేడు కుయ్యో మొర్రో అంటున్నాయి. ఇక 104 వాహనాల జాడే లేకుండా పోయింది. ఆరోగ్యశ్రీ , ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌ పథకాలు నిర్వీర్యంగా మారాయి. దీంతో మళ్లీ పేదలు వైద్యం కోసం అప్పులు చేయాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో గత 22 నెలల చంద్రబాబు పాలనలో వైద్యసేవలు పూర్తిగా దిగజారాయి. దేశంలోనే తొలిసారిగా గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా స్పెషలిస్టు వైద్యులను నేరుగా గ్రామాలకు పంపించి వైద్య పరీక్షలు చేసి ప్రజలకు భరోసా కల్పించారు. జనరల్‌ మెడిసిన్‌, గైనకాలజీ, ఆర్థోపెడిక్‌, పిడియాట్రిక్‌, జనరల్‌ సర్జరీ ఇలా పలు విభాగాలకు చెందిన వైద్యులు గ్రామాలకే వెళ్లి సేవలు అందించారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి ఆస్పత్రిలో వైద్యం అందించాల్సి ఉంటే మెరుగైన వైద్యం కోసం జీజీహెచ్‌కు తరలించారు. ఆ రోగి జీజీహెచ్‌కు వెళ్లి చికిత్స పొంది డిశ్చార్జి అయ్యే వరకూ ఆరోగ్య సిబ్బంది ఫాలో అప్‌ చేస్తూ ఉండేవారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, హైపోథైరాయిడ్‌ వంటి వ్యాధులతో బాధపడే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండేది. ప్రస్తుతం ఆ కార్యక్రమం నిలిచిపోయింది. దేశానికి ఆదర్శంగా నిలిచిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమానికి ప్రస్తుత ప్రభుత్వం మంగళం పాడింది. మారుమూల గ్రామాలకు సైతం 104 వాహనంలో కుటుంబ డాక్టర్‌(ఫ్యామిలీ ఫిజీషియన్‌) కార్యక్రమం ద్వారా పదిహేను రోజులకు ఒకసారి వెళ్లి వైద్య సేవలు అందించే వారు. ప్రతి గ్రామాన్ని మ్యాపింగ్‌ చేసి, ఎంపిక చేసిన తేదీల్లో కచ్చితంగా వైద్యులు, సిబ్బంది వెళ్లి సేవలు అందించేవారు. నడవలేని స్థితిలో మంచాన ఉన్న రోగుల ఇళ్లకే వెళ్లి చూసేవారు. ఇప్పుడు అవేమీ లేకపోగా, గ్రామాల్లో ఉండే విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు సైతం నిర్వీర్యంగా మారాయి. వాటిలో ఉండాల్సిన కనీస మందులు కూడా అందుబాటులో ఉండటం లేదు. 108 వాహనాలు ఎన్టీఆర్‌ జిల్లాలో 24, కృష్ణా జిల్లాలో 29 ఉన్నాయి. ఇవి కొంత కాలంగా మరమ్మతులకు గురవుతున్నాయి. కుయ్‌..కుయ్‌..కుయ్‌ అంటూ క్షతగాత్రులు, రోగులను వేగంగా ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సిన వాహనాలు కుయ్యో..మొర్రో అంటూ కదులుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండటం లేదు. దీంతో రోగులు ప్రాణాపాయ పరిస్థితికి చేరుకుంటున్నారు. గతంలో రక్తపోటు, మధుమేహం, హైపో థైరాయిడ్‌ వంటి దీర్ఘకాలిక రోగులను గుర్తించి, వారిని 104 సేవలకు మ్యాపింగ్‌ చేసేవారు. దీంతో ఆ గ్రామానికి వెళ్లినప్పుడు వారు క్రమం తప్పకుండా మందులు వాడేలా చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు మందుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్రీడా అకాడమీల్లో ప్రవేశాలకు ఎంపికలు

న్యూస్‌రీల్‌

రెండేళ్లలో దిగజారిన ప్రభుత్వ వైద్యసేవలు పల్లెల్లో వైద్యం అందని దయనీయ పరిస్థితి కుయ్యో.. మొర్రో అంటున్న 108 వాహనాలు నిలిచిన 104 సేవలు ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ ఫిజీషియన్‌లకు బ్రేక్‌ దీర్ఘకాలిక రోగుల ఇక్కట్లు

ఎన్టీఆర్‌ జిల్లా
మంగళవారం శ్రీ 14 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

కృష్ణలంక: ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖరబాబును సోమవారం ట్రాఫిక్‌ ఏసీపీ డాక్టర్‌ శ్రీవేద బాధ్యతల స్వీకరణ అనంతరం మర్యాదపూర్వకంగా కలిశారు.

చిలకలపూడి(మచిలీపట్నం): బందరు కలెక్టరేట్‌ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్‌ బాలాజీ సోమవారం తనిఖీ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

భవానీపురం(విజయవాడపశ్చిమ): భక్తుల సౌకర్యం, భద్రత, మెరుగైన సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని దుర్గగుడి ధర్మకర్తల మండలి సభ్యులు నిర్ణయించారు. బ్రాహ్మణ వీధిలోని కార్యాలయంలో సోమవారం దుర్గగుడి ధర్మకర్తల మండలి సభ్యుల సమావేశం జరిగింది. దీనిలో దుర్గగుడి మాస్టర్‌ ప్లాన్‌ అమలు తీరు, కుంభాభిషేకం సమయంలో ఆలయ ఉద్యోగిపై జరిగిన దాడిపై చర్చించారు. ఎక్కెడెక్కడ ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, రికార్డుల పరంగా ఉండాల్సిన భూముల్లో ఎన్ని ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి, ఎవరెవరు కౌలుకు తీసుకున్నారు, ప్రస్తుతం వారి చేతుల్లోనే భూములు ఉన్నాయా.. చేతులు మారాయా, కౌలుకు ఇచ్చిన భూముల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, కౌలుదారులు కౌలు సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా వంటి అంశాలపై చర్చ జరిగింది. అమ్మవారి పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించేందుకు క్యూ లైన్లలో టీవీలు ఏర్పాటు చేయాలని, ఆలయ ఉద్యోగుల ఆరోగ్యం కోసం ఆస్పత్రితో ఎంఓయూ కుదుర్చుకోవాలని, జూన్‌ నుంచి అన్నదానం, లడ్డూ పోటు ప్రారంభించాలని నిర్ణయించారు. సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండాలోని 19 అంశాలను ఆమోదించగా 65వ అంశాన్ని తీర్మానించడం, 83, 84, 103 అంశాలను వాయిదా వేశారు.

వాడీవేడిగా..!

సమావేశంలో పలుఅంశాలపై వాడీవేడిగా చర్చ జరిగినట్లు తెలిసింది. కనకదుర్గమ్మ ఆలయంలో ఇటీవల చోటుచేసుకున్న బంగారం చోరీ ఘటన, దుర్గ గుడి అభివృద్ధి, దైనందిన కార్యకలాపాలపై చేసిన ప్రతిపాదనలపై ఆలయ అధికారులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిపై మండలి సభ్యులు మండిపడ్డారని సమాచారం. ధర్మకర్తల మండలి చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ(గాంధీ), ఈఓ శీనా నాయక్‌, ఈఈలు కోటేశ్వరరావు, ఎల్‌.రమ తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణ కోసం విజయవాడకు చెందిన భక్తులు సోమవారం రూ. 2 లక్షల విరాళాన్ని అందజేశారు. నగరంలోనిపటమటకు చెందిన పి.హరినాథ్‌బాబు అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి తన తండ్రి వెంకట సుబ్బయ్య పేరిట రూ.లక్ష, తల్లి నాగమణి పేరిట మరో రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. దాతకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆయనకు అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను ఇచ్చారు.

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): అంతర్జాతీయ వారసత్వ దినోత్సవం పురస్కరించుకుని నిర్వహిస్తున్న కొండపల్లి బొమ్మల మేళాను విజయవంతం చేయాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. కొండపల్లి ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న కొండపల్లి బొమ్మల మేళా వివరాలను ఆయన సోమవారం వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ 18న ఖిల్లాపైకి ట్రెక్కింగ్‌ చేసిన అనంతరం బొమ్మల మేళా ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. రెండోరోజు ఈ మార్కెట్‌ లీడర్స్‌, ఈ హ్యాండీక్రాఫ్ట్‌, కార్టూన్‌ మేకర్స్‌, ఆన్‌లైన్‌ కార్టూన్‌ సిరీస్‌ను క్రియేట్‌ చేస్తారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ చెన్నుబోయిన చిట్టిబాబు, చుట్టుకుదురు శ్రీనివాస్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వత్సవాయి: మండల కేంద్రం వత్సవాయిలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలను రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి ఎన్‌.సవిత సోమవారం జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌తో కలిసి తనిఖీ చేశారు. ముందుగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వసతి ప్రమాణాలు, నిర్వహణ, భోజన నాణ్యత తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. మంత్రి స్వయంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని రుచిచూశారు. అనంతరం గ్రామానికి చెందిన ప్రవాసభారతీయుడు చిరుమామిళ్ల రాంబాబు తన సొంత నిధులు రూ.35 లక్షలతో పాఠశాల పైభాగంగా నిర్మాణం చేస్తున్న అదనపు తరగతి గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్వో ప్లాంటును విద్యార్థులకు అందించిన జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బొగ్గవరపు వెంకటరాజారావును సన్మానించారు.

నందిగామకు చెందిన మరియమ్మ పక్షవాతంతో మంచానికే పరిమితమైంది. గతంలో ఫ్యామిలీ ఫిజీషియన్‌ పథకం ఉండగా వైద్యులు ఇంటికే వచ్చి చూసే వాళ్లు. ప్రస్తుతం ఆ పథకం సేవలు నిలిచిపోవడంతో మందులు ఇచ్చే వాళ్లు కూడా లేక ఇబ్బందులు పడుతోంది.

గ్రామీణులకు భరోసా ఏది?

నిలిచిన ఫ్యామిలీ ఫిజీషియన్‌ పథకం

కుయ్యో.. మొర్రో అంటున్న 108

దీర్ఘకాలిక రోగుల ఇబ్బందులు

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యువతకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి జిల్లాల్లో ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఆధ్వర్యంలో క్రీడా అకాడమీలను ఏర్పాటు చేసిందని, వాటిలో 2026–27 విద్యాసంవత్సరానికి ఎంపికలు చేస్తామని ఎన్టీఆర్‌ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె.కోటేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2008 నుంచి 2011 సంవత్సరాల మధ్య జన్మించిన 15 నుంచి 19 ఏళ్ల లోపు బాల బాలికలు పాల్గొనవచ్చని తెలిపారు. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు తిరుపతిలో జూడో, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, రైఫిల్‌ షూటింగ్‌, లాన్‌ టెన్నిస్‌ క్రీడల్లో ఎంపికలు జరుగుతాయని, ఈ నెల 29, 30 తేదీల్లో కాకినాడలో జిమ్నాస్టిక్స్‌, హాకీ, ఖోఖో పోటీలు, మే 4, 5 తేదీల్లో అథ్లెటిక్స్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, సైక్లింగ్‌ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు, విద్యార్థి బ్యాంక్‌ పాస్‌బుక్‌, విద్యాసంస్థ నుంచి స్టడీ సర్టిఫికెట్‌, క్రీడా సర్టిఫికెట్లు, మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఒరిజినల్స్‌, సెట్‌ జిరాక్స్‌లు, పాస్ట్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోలు –10తో ఆయా జిల్లాలో ఉన్న డీఎస్‌డీవోలకు సంప్రదించాల్సిందిగా సూచించారు. క్రీడా దుస్తులు, కిట్‌ తీసుకువెళ్లాలని పేర్కొన్నారు.

7

Advertisement
 
Advertisement
Advertisement