నాడు పత్తిని రూ.7వేలకు కొన్నారు..
గ్రామంలో 20 ఎకరాలు పత్తి పంట సాగుచేశా. తుపాను దెబ్బకు ఎకరానికి నాలుగు క్వింటాళ్లు పత్తి మాత్రమే దిగుబడి వచ్చింది. జగన్ ప్రభుత్వంలో క్వింటా పత్తిని రూ.7.500కు కొన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తిని కిలో కూడా కొనలేదు. ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోవటం లేదు. కనీసం పత్తి పంట దెబ్బతిన్నా ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు ఎలా తీరుతాయో అర్థం కావటంలేదు.
– షేక్ మొహిద్దీన్ పాషా, రైతు,
మోగులూరు, కంచికచర్ల మండలం


