విజయవాడ సిటీ
ఆదివారం శ్రీ 16 శ్రీ నవంబర్ శ్రీ 2025 ● ఎన్టీఆర్ జిల్లాలోని
గడ్డమణుగులో గుర్తింపు
● నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నా
ఫలితం అంతంతమాత్రమే
● అప్రమత్తంగా వ్యవహరించకపోతే
భవిష్యత్‌లో భారీ నష్టం
● శాశ్వత పరిష్కారం చూపాలంటున్న రైతులు సాగర్ నీటి మట్టం వివరాలు
25 నుంచి సుబ్రహ్మణ్య షష్ఠి కల్యాణ మహోత్సవాలు ఉద్యాన పంటలపై ఆఫ్రికా నత్తల దాడి జి.కొండూరు: ప్రకృతి వైపరీత్యాలు, పురుగులు, తెగుళ్లతో ఈ ఏడాది భారీగా నష్టపోయిన రైతులకు ఆఫ్రికన్ జెయింట్ నత్తలు మరో తలనొప్పిగా మారాయి. ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో తెలియదు కానీ ఇటీవల వర్షాలకు ఇవి ఎన్టీఆర్ జిల్లాను తాకాయి. జి.కొండూరు మండల పరిధి గడ్డమణుగు, జి.కొండూరు, చెర్వుమాధవరం గ్రామాల్లో ఈ ఆఫ్రికన్ నత్తలు ఉద్యాన పంటలపై ప్రతాపం చూపుతూ పంటలను నాశనం చేస్తున్నాయి. మొదట్లో సాధారణ నత్తలే అని భావించిన రైతులు వాటి దాడి ప్రభావం చూసిన తర్వాత విషయాన్ని ఉద్యానశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే అధికారులు సూచనల మేరకు చేపట్టిన నిర్మూలనా చర్యలు సైతం సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పుడిప్పుడే కొమ్మలు, ఆకులు వృద్ధి చెందుతున్న మిరప పైరుపై ఈ ఆఫ్రికన్ జెయింట్ నత్తలు దాడి చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్‌లో వీటి ప్రభావం ఎక్కువైతే మిరప దిగుబడులు తగ్గి తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు.
గడ్డమణుగు గ్రామంలో..
ఎన్టీఆర్ జిల్లాలో 43,839 హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతుండగా జి.కొండూరు మండల పరిధిలో 1,798హెక్టార్లలో వివిధ ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. అదేవిధంగా గడ్డమణుగులో వంగ 3.2హెక్టార్లు, దోస 4.8హెక్టార్లు, టమాటా 1.6హెక్టార్లు, మునగ 3.2హెక్టార్లు, అరటి 0.40హెక్టార్లు, బొప్పాయి 4హెక్టార్లు, నిమ్మ 8.40హెక్టార్లు, ఆయిల్ ఫామ్ 5.6హెక్టార్లు, మామిడి 16హెక్టార్లు, మిరప 15హెక్టార్లలో సాగవుతోంది. అయితే ఇటీవల వర్షాలకు ఈ ఆఫ్రికన్ నత్తలు ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడా కనిపించినప్పటికీ ముఖ్యంగా గడ్డమణుగులోనే మొదటగా వీటి ప్రభావం చూపాయి. ఈ గ్రామంలో ఒక రైతుకు చెందిన నాలుగు ఎకరాల వంగ తోటపై నత్తలు ప్రతాపం చూపడంతో వీటి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి నత్తలు దాడి చేస్తున్న వంగ, మిరప, ఆయిల్ ఫామ్ తోటలను పరిశీలించారు. నత్తల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు సలహాలు సూచనలు ఇచ్చారు. ఈ నత్తలు ప్రస్తుతం మిరప పైరుపై దాడిగి తెగబడుతున్నాయి. నెలరోజుల వయస్సు ఉన్న మిరప పైరుపై రాత్రి సమయాలలో దాడి చేసి ఆకులను పూర్తిగా తినడంతో మొక్కలు మోడుగా మారుతున్నాయి. నత్తల ఉనికి మరో మూడు నెలలపాటు ఉండే అవకాశం ఉండటంతో మిరప సాగు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నత్తల దాడి ఎలా ఉంటుందంటే ఒక్క రాత్రిలోనే మూకుమ్మడిగా దాడిచేసి పైరు అంతా నాశనం చేయగలవు. ఈ నత్తల సమస్యకు శాశ్వత నిర్మూలనా మార్గాలను అన్వేషించకపోతే రైతులు భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. గడ్డమణుగు గ్రామశివారులోని వంగ తోటలో రైతులు ఏరి పడేసిన ఆఫ్రికా నత్తలు
న్యూస్‌రీల్
నత్తల ఉనికి తగ్గుముఖం పట్టింది
గడ్డమణుగు గ్రామంలో ఆఫ్రికన్ నత్తల ఉనికి తగ్గుముఖం పట్టింది. మొదట వంగ, ఆయిల్‌ఫామ్, మిరప పంటలపై నత్తలు దాడి చేశాయి. శాస్త్రవేత్తలతో కలిసి నత్తలను పరిశీలించాం. వీటి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించాం. ఇప్పటికే మందులను పిచికారీ చేస్తుండటంతో క్రమంగా తగ్గుతూ వచ్చాయి. రైతులు ఆందోళన చెందనవసరం లేదు. ఉద్యానశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నత్తలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలి.
పి.బాలాజీకుమార్,
ఉద్యానశాఖ అధికారి, ఎన్టీఆర్ జిల్లా
నత్తలు తినడంతో పాడైపోయిన
వంకాయలు
ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 16 శ్రీ నవంబర్ శ్రీ 2025
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం శనివారం 586.80 అడుగులకు చేరింది. ఇది 304.4680 టీఎంసీలకు సమానం. శ్రీశైలం నుంచి 14,274 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
మోపిదేవి: మోపిదేవిలో వేంచేసియున్న శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి షష్ఠి కల్యాణ మహోత్సవాలు ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా శనివారం ఉదయం స్థానిక శాసనసభ్యుడు మండలి బుద్ధ ప్రసాద్ చేతుల మీదుగా షష్ఠి కల్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆలయ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఉత్సవ వివరాలను వివరించారు.
కార్యక్రమాల వివరాలు..
ఈనెల 25వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారిని పెళ్లి కుమారుని చేయడం, 26వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవం, సాయంత్రం మయూర వాహనంపై రావివారిపాలెం వరకు గ్రామోత్సవం, 27వ తేదీ గురువారం ఉదయం 6 గంటలకు వసంతోత్సవం, మహా పూర్ణాహుతి, ఉదయం 11 గంటలకు శేషవాహనంపై రావివారిపాలెం వరకు గ్రామోత్సవం, రాత్రి 7 గంటలకు ద్వాదశ ప్రదక్షిణలు, అనంతరం రాత్రి 8 గంటలకు స్వామివారికి పుష్పశయ్యాలంకృత పర్యంకసేవ ఉంటాయని వివరించారు. ఈ ఉత్సవాలు వల్ల ఈ మూడు రోజుల పాటు ఆర్జిత సేవలన్నీ రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జెడ్పీటీసీ మెడబలిమి మల్లికార్జునరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి సాయిబాబు, ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
7
1/7
విజయవాడ సిటీ
2/7
విజయవాడ సిటీ
3/7
విజయవాడ సిటీ
4/7
విజయవాడ సిటీ
5/7
విజయవాడ సిటీ
6/7
విజయవాడ సిటీ
7/7
విజయవాడ సిటీ