
అండర్–19 కుస్తీ పోటీలు ప్రారంభం
విజయవాడరూరల్: మండలంలోని నున్న జిల్లా పరిషత్ హైస్కూల్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాలల క్రీడా సమాఖ్య (ఏపీజీఎఫ్)అండర్–19 అంతర్ జిల్లాల కుస్తీ పోటీలు స్థానిక అశోక్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఏపీ రెజ్లింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.భూషణం, నున్న జడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం ఎస్.రవిప్రసాద్, ఎస్‌ఎంసీ చైర్మన్ జి.కుమార్ టోర్నమెంట్ పరిశీలకుడు సీహెచ్ రమేష్ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలకు ఉమ్మడి 13 జిల్లాల నుంచి 350 మంది క్రీడాకారులు, కోచ్‌లు మేనేజర్లు హాజరయ్యారు. అండర్–19బాలుర, బాలికల ఫ్రీస్టైల్, బాలుర గ్రీకోరోమన్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తారు. కార్యక్రమంలో టెక్నికల్ కమిటీ ఇన్‌చార్జి పి.ఆనంద్, శాప్ కోచ్‌లు కె.మనోహర్, ఎస్.కనకదుర్గ, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి టి.శ్రీలత పాల్గొన్నారు.